1982లో సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి 1983లో అధికారంలోకి వచ్చాక పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాలిసినదిగా పది నిబంధనలు రూపొందించారు. వాటినే ఎన్టీఆర్ శాసనాలు అంటారు. టీడీపీ పార్టీ నుండి గెలిచిన శాసనసభ్యులు ఈ 10 శాసనులను తప్పక పాటించాలి అనేది ఎన్టీఆర్ అభిమతం. ఆ పది శాసనాలు ఏంటి, ఇప్పుడు సాక్ష్యాత్ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ఆ శాసనాలు ఎంతవరకు పాటిస్తున్నారో చూద్దామా…
1.తెలుగుదేశం శాసన సభ్యులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి..
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కార్యకర్తలను ఎగదోయడం, ప్రజలను రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న ఊర్లలో గొడవలు లేపడం, ఏదైనా మేం చూసుకుంటాం అని రెచ్చగొట్టి తీరా ఇబ్బందుల్లో పడ్డాక చేతులెత్తేయడమే తెలుసు బాబు టీడీపీ కి, ఇక అధికారం లోకి వస్తే ప్రజలు కంటికి కూడా కానరారు.. తను రెండు సార్లు ఓడిపోయిన విషయం కూడా మర్చిపోయి మళ్లీ మాయ ముచ్చట్లతో సీఎం అయ్యాక తానో దైవాంశసంభూడిలా భావించుకుంటూ తోకలు కత్తిరిస్తా అంటూ బెదిరిస్తాడు తప్ప, ప్రజలకు అందుబాటులో ఉండటం వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం బాబుకి అస్సలు తెలియని పాఠ్యాంశం….
2.ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల విషయం లో జోక్యం చేసుకోరాదు…
బాబు హయాంలో రికమండేషన్ లేకుండా జరిగే ఒక్క బదిలీ ఉండదు, ఒక్క ప్రమోషన్ ఉండదు.. చివరికి కానిస్టేబుల్ బదిలీ జరగాలి అన్నా ఎమ్మెల్యే రికమండేషన్ ఉండాల్సిందే, తన వారికి అయితే నిబంధనలన్నీ పక్కన బెట్టి మరీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ లు ఉంటాయి.. ఇక ఇప్పుడు కొత్తగా లోకేష్ ఎర్రబుక్కు అంటూ తనకు సహకరించని, చట్టప్రకారం నడుచుకుంటూ ఉన్న అధికారాలను తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల నుండి తీసేస్తాం అని, బదిలీ చేస్తాం అనీ, సస్పెండ్ చేస్తాం అనీ ప్రత్యక్ష బెదిరింపులుకు దిగుతున్నాడు..
3.అవినీతిని అంతమొందించి స్వచ్ఛమైన పాలనను అందించడానికి సహకారం అందించాలి..
బాబు టీడీపీ లోకి రాకముందే మంత్రిగా చేసిన రెండున్నర ఏళ్లలోనే ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నాడు, ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అర్ధరాత్రులు టార్చ్ లైట్ లు పట్టుకుని కమీషన్ల కోసం వెళ్లేవాడు… ఇక సీఎం అయ్యాక బాబు అవినీతి గురించి చెప్పనక్కర్లేదు… మురుగు గుంతలైనా, ఇంకుడు గుంతలైనా, ఆఖరికి మరుగు దొడ్లైనా బాబు హయాంలో అవినీతి లేకుండ జరగవు..
4.ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే లు సన్మానాలు, విందులు నిర్వహించకూడదు..
తుఫాన్ వస్తే అధికారులు పని మానుకుని బాబు కోసం వేచి చూడాలి, ఆయనొచ్చి చెట్టు నరుకుతున్నట్టుగా ఫోటో స్టిల్ ఇచ్చాక, ఆయన ఓ గంట మీడియా ముందు వాయింపు కార్యక్రమం పూర్తయ్యాకే అధికారులు ఏదైనా చెయ్యడానికి వీలుంటుంది.. ఇక విందులు, సంబరాలు అయితే హద్దే లేదు.. హుదూద్ విజయోత్సవ సభ అంటూ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సంబరాలకు వాడతాడు… నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా…
5.పేదలు, వెనుకబడిన వర్గాల ఉన్నతికి శాసన సభ్యులు స్వార్థపూరిత శక్తుల ఏరివేతకు కృషి చేయాలి..
బాబు దృష్టిలో పేదలు అంటే కార్పోరేట్ శక్తులు, ఏరివేసేది ఏమో పేదలను.. రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని అధికారం లో ఉన్న ప్రతీ సారి సామాన్యుల మీద పన్ను భారం పెంచి, కార్పోరేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా వారికి భూములు కట్టబెట్టడం, రాయితీలు ఇవ్వడం, పేదోడు తినే రేషన్ బియ్యం ధర కూడా పెంచేసి వారి నడ్డి విరవడం…
6.బ్లాక్ మార్కెట్ చేసేవారిని, అక్రమ నిల్వదారులను, ఇతర సంఘ వ్యతిరేక శక్తులను బహిరంగపరచి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి..
ఇది మహా అద్భుతం బాబు హయాం లో, బాబు చుట్టూ కోటరీ మొత్తం బ్లాక్ మార్కెట్ దళమే, దళారీలు, హవాలా చేసేవాళ్లు, ఇలా అన్నిరకాల సంఘవిద్రోహ శక్తులూ బాబు పెంచి పోషించే వర్గమే. మద్యపాన నిషేధం ఎత్తేయి వేసిందే తనకోసం పనిచేసే మద్యం సిండికేట్ వ్యక్తుల కోసం.. 2014 తర్వాత ఐదేళ్లలో 30 వేల బెల్టు షాపులను రాష్ట్రం లో కొత్తగా పుట్టించగలిగే పాలన అందించాడు అంటే అర్థం చేసుకోవచ్చు బాబు ఏ రకంగా ఈ నియమాన్ని అమలు చేశాడో..
7.శాసన సభ సమావేశాల్లో చురుకుగా పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వ్యక్తిత్వం మీద తన సభ్యులచేత నానా మాటలు అనిపించడం, అధికారంలో లేనప్పుడు ఎవరూ ఏమనకుండానే నన్నిలా అన్నారని ప్రెస్మీట్ పెట్టి ఏడుస్తూ అసెంబ్లీ కి వెళ్ళను అనడం, సభలో తన సభ్యుల చేత విజిల్స్ వేయిస్తూ చర్చ జరక్కుండా అడ్డుకోవడం, తొడలు కొట్టడం, నరికేస్తా, పాతేస్తా అంటూ “పద్దతి” గా మాట్లాడించడం… ఇదే బాబుకు తెలిసిన ప్రజాసమస్యల చర్చపై ఉన్న చిత్తశుద్ధి..
8.చీఫ్ విప్, విప్ ల ఆదేశాలు పాటించాలి…
పాపం విప్ లు, చీఫ్ విప్ లాంటి వారికి బాబు దగ్గర ఎలాంటి అవకాశం ఉండదు పేరుకే అవన్నీ, అన్ని బాబే. అధికారంలో ఉంటే సభ్యులని ప్రతిపక్షాల మీదకి రెచ్చగొడుతూ సైగల ద్వార అనధికారిక విప్ జారీ చేస్తుంటాడు. అధికారంలో లేనప్పుడు మాత్రం బాబు జారీ చేసే విప్ ల గురించి వాళ్ళ సభ్యులే పట్టించుకోరు…
9.పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడం..
ప్రతిపక్ష్యం లో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి చట్టవ్యతిరేక పనులు చేయించడం మీ వెనుక మేమున్నాం అని అబద్దపు హామీ ఇవ్వడం, తీరా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని గాలికొదిలేసి ప్రభుత్వం మీదే నిందలు వేయడం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కార్యకర్తలు గుర్తు రారూ, వారి సంక్షేమం గుర్తు రాదు..
10. నిజాయితీగా, నిరాడంబరంగా ఉండటమే కాక, పార్టీ ఇచ్చిన హామీలని తప్పనిసరిగా నెరవేర్చాలి..
అన్నిట్లోకెల్లా ఇదే గొప్పది… నిజాయితీ? బాబు దగ్గర ఎవరూ ఊహించనటువంటిది.. నిరాడంబరత… చేసిన గొప్ప పనినే చెప్పుకోకపోవడం అయితే. తనకేమాత్రం సంబంధం లేని దాన్ని కూడా తానే చేశానని చెప్పుకోడం బాబు నైజం.. అది నేనే, ఇది నేనే, అన్ని నేనే అంటూ ఆఖరికి పిచ్చి ముదిరి అలెక్సా కూడా నేనే కనిపెట్టా అనే స్టేజ్ కి వచ్చాడు..
ఇక హామీలు నెరవేర్చడం గురించి అంటే వారు పార్టీ వెబ్సైట్ నుండి డిలీట్ చేసిన టీడీపీ 2014 ఎలక్షన్ మేనిఫెస్టో వెతకాల్సి ఉంటుంది….
ఎన్టీఆర్ పది సిద్ధాంతాలు పెడితే… పదికి పది తూచా తప్పకుండా… పక్కాగా…… బాబు తను కనిపెట్టిన కంప్యూటర్ లో వేసి ప్రింట్ తీయగా వచ్చిన వ్యతిరేఖ సిద్ధాంతాలను పాటిస్తుంటాడు….
ఇది ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కాదు, ఎన్టీఆర్ టీడీపీ కాదు.. అది ఆయనతోపాటే అంతర్థానం అయిపోయింది.. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు “తెలుగు దళారీల పార్టీ”……