కూటమి తరుపున వైజాగ్ సౌత్ లో జనసేన పోటీలో ఉండబోతుంది. పార్టీ తరపున భీమిలీ లేదా వైజాగ్ లో ఎక్కడైన టికెట్ ఇస్తామనే హామీతో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ సౌత్ టికెట్ కేటాయించారు. ఆరోజు నుండి వైజాగ్ సౌత్ జనసేనలో అసమ్మతి నిప్పు రాజుకొని, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఈరోజు నియోజకవర్గంలో కార్చిచ్చులా రగిలి జనసేన పార్టీని నిలువెల్ల దహించి వేస్తున్నది. జనసేన పార్టీలో […]