హిట్ అనే పదానికి దూరమై చాలాకాలం అయినా కూడా ఆది సాయి కుమార్ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే మరో కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. కాగా ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆది సాయి కుమార్, వీరభద్రం కాంబోలో చుట్టలబ్బాయ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. […]