నేడు ఐపీఎల్ 2024 సీజన్ 42వ మ్యాచ్ లో కోల్ కత్తా ఇడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది , ఈ రోజు పంజాబ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఈ సీజన్ లో కేకేఆర్ జట్టు అధ్బుతమైన ఆటతీరుతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుంటే పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో ఉంది.
ఈరోజు మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఛాన్స్ లు దాదాపుగా సన్నగిల్లుతాయి , తరువాత మ్యాచ్ లు అన్ని ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది, జట్టు బలాబలాలు చూస్తే కోల్ కత్తా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనపడుతుంది , పైగా ఈడెన్ గార్డెన్స్ సొంత మైదానం కావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం