ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ టీమ్ మరో ఆసక్తికర సమరానికి రెడీ అయింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టబోతుంది టైటిల్యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది.
బలాబలాలు చూస్తే ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ సొంత మైదానంలో ఢిల్లీ జట్టును తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితికి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఏర్పడింది.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో హైదరాబాద్, ఢిల్లీ జట్లు మధ్య 23 మ్యాచ్‌ల్లో పోటీ పడగా.. సన్‌రైజర్స్12 సార్లు, ఢిల్లీ 11 సార్లు గెలిచాయి. గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీదే పైచేయి సాధించింది. 2022లో జరిగిన ఒక్క మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌యే నెగ్గగా, గత సీజన్లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.