ఐపీఎల్ – 2024 నేపథ్యంలో వైజాగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కేకేఆర్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది, కేకేఆర్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు, సునీల్ నరైన్ , సాల్ట్ ఇద్దరూ మొదటి నుంచే ఢిల్లీ కాపిటల్స్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగారు కేవలం 7.3 ఓవర్లలోనే ఆ జట్టు 1 వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసారు. మొదటి వికెట్ గా సాల్ట్ అవుటైనా సునీల్ నరైన్ దూకుడు ఆగలేదు 39 బంతుల్లో 7 ఫోర్లు , 7 సిక్స్ లతో 85 పరుగులు చేసాడు , సునీల్ కి తోడుగా ఇంకో యువ ఆటగాడు రఘు వంశీ కి ఇది మొదట మ్యాచ్ అయినా 27 బంతుల్లో 54 పరుగులు ( 5 ఫోర్లు , 3 సిక్స్ లు) చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.
వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు బౌండరీల మోత మోగిస్తున్నే ఉన్నారు రస్సెల్ 19 బంతుల్లో 41 పరుగులు ( 4 ఫోర్లు , 3 సిక్స్ లు ) రింకూ సింగ్ 8 బంతుల్లో 26 పరుగులు ( 3 సిక్స్ లు 1 ఫోర్ ) చేసారు
ఒకానొక దశలో ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టించిన 277 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తారనిపించింది కానీ లాస్ట్ ఓవర్ ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయడంతో ఆ రికార్డ్ పదిలంగా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు సాధించారు , ఈ జట్టుకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక స్కోర్ కాగా, ఐపీఎల్ లో చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ గా రికార్డ్ నెలకొల్పారు.
ఢిల్లీ బౌలర్లు అందరూ చేతులెత్తేసారు ,, దాటిగా పరుగులు సమర్పించుకున్నారు నోర్జ్ 3 వికెట్లు ఇషాంత్ శర్మ 2 వికెట్లు , ఖలీల్ , మార్ష్ చెరొక వికెట్ సాధించారు
273 పరుగుల భారీ లక్య్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ కేకేఆర్ బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది , పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది.ఏ దశలోను లక్ష్యాన్ని ఛేదించేలా కనపడలేదు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కెప్టెన్ పంత్ , స్టబ్స్ కాసేపు అలరించారు , వెంకటేష్ అయ్యార్ వేసిన ఒక ఓవర్లో అయితే పంత్ 28 పరుగులు చేసాడు , సబ్స్ 54 పరుగులు , పంత్ 55 పరుగులు చేసి వెనుదిరిగారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయ్యారు , దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 106 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది, ఈ జట్టుకు ఇది వరుసగా మూడో విజయం.
కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు వైభవ్ అరేరా మూడు వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు , రస్సెల్ , సునీల్ నరైన్ చెరొక వికెట్ తీసుకున్నారు. అద్బుత బ్యాటింగ్ చేసిన సునీల్ నరైన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది