నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ లో ముందడుగు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఖచ్చితంగా గెలుపు కోసం తీవ్రంగా పోరాడతారు, ఇరు జట్ల అంచనా ఆటగాళ్ళని, బలాబలాలను చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా గుజరాత్ టైటాన్స్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది .
టాస్ ఎవరు గెలిచినా ఎక్కువ శాతం ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు,ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ టైటన్స్ , ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఇరు జట్ల ఐపీఎల్ రికార్డు సమం అవుతుంది.