ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ కు టైం పెద్దగా కలిసి వస్తునట్టు కనిపించడంలేదు. ఐప్యాక్ టీంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆయన ప్రతిభ ఆ టీం నుండి దూరం కాగానే మసకబారినట్టు కనిపిస్తుంది. దీంతో ఆయన ఎన్నికల ఫలితాలకి సంబంధించి చెప్పే జోస్యాలు వరుసగా విఫలం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
జర్నలిస్ట్ కరణ్ థాపర్ తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 300 సీట్లు గెలుచుకోగలదని, కాంగ్రెస్కు 100 సీట్లు రావడం కష్టమని కిషోర్ ఆ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా గతంలో ప్రశాంత్ కిషోర్ అటు హిమాచల్ ప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలేదని చెప్పిన మీ మాట నిజం కాలేదు కదా అని కరణ్ థాపర్ ఎదురు ప్రశ్నించగా ప్రశాంత్ కిషోర్ తీవ్ర అసహనానికి గురైయ్యారు. తాను ఎప్పుడు ఆ మాట అనలేదని బుకాయించే ప్రయత్నం చేసినా కరణ్ థాపర్ ప్రశాంత్ కిషొరే స్వయంగా చేసిన ట్వీట్ ని ప్రదర్శించే సరికి ఇరుకున పడ్డారు.
ఐప్యాక్ అనే సంస్థలో పనిచేసినన టీం చేసిన కృషి వలనే ప్రశాంత్ కిషోర్ కి పేరు వచ్చిందని, ఇప్పుడు ఆ టీంతో తాను లేకపోయేసరికి తన పేరు మసకబారుతూ వస్తుందనే వాదన తీవ్రంగా నడుస్తున్న ఈ సమయంలో జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఎదుర్కున్న ప్రశ్నలతో ఆయన ఇమేజ్ మరింత మసకబారిందనే చెప్పాలి. ఏది ఏమైనా సైరైన టీంతో ఉన్నప్పుడు వచ్చిన పేరుని తాన ఖాతాలో వేసుకుని ఇన్నిరోజులు ప్రశాంత్ చలామణి అయ్యాడే కానీ ఆయనలో అనుకున్నత విషయం లేదని పలువురు చెబుతున్న మాట.