ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రకృతి వ్యవసాయ సంపద కోసం అవలంబిస్తున్న తీరును అంతర్జాతీయ ప్రతినిధి బృందం ప్రశంసించింది. పులివెందులలో ఏర్పాటు చేసిన ఇండో- జర్మన్ గ్లోబల్ అకాడమీ సందర్శనకు వచ్చిన జర్మన్ ప్రతినిధులు మరియు అంతర్జాతీయ ప్రతినిధులు బృందం ఏపీలో అమలవుతున్న ఎకలాజీ కార్యక్రమాలను పరిశీలించి బలోపేతం చేసే ప్రణాళికను రూపొందించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యటించడం గమనార్హం.
ఈ పర్యటనలో ఏపీలోలో జగన్ ప్రభుత్వం, అధికారులు సహకారంతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న తీరును చూసి అంతర్జాతీయ ప్రతినిధుల బృందం సంతోషం వ్యక్తం చేసింది. ప్రకృతి వ్యవసాయంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వర్షాధారిత ప్రాంతమైన రాయలసీమలో ఏడాది పొడవునా పంటలు పండించడం ద్వారా వాతావరణంలో కూడా మార్పులు చేసుకుంటాయని ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఏపీలో గతంలో ఎక్కువగా వాతావరణ ఆధారిత పంటలు సాగు చేసేవారు. కానీ క్రమేపీ అది తగ్గి రసాయనిక ఎరువులును వాడకంలోకి తీసుకొని వచ్చి కలుషిత పంటలను రెండు దశాబ్దాలు పాటు వేస్తూనే ఉన్నారు. ఇలా ఇదే కొనసాగితే వాటిని తినడం ద్వారా ఆరోగ్య ప్రమాణాలు రోజు రోజుకి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బృంద పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా అధికార ప్రతినిధి బృందం వాన్స్టిచ్ , సీనియర్ పాలసీ ఆఫీసర్ అలెగ్జాండర్, KFW కంట్రీ మేనేజర్ జోస్క గ్రవ్, సీనియర్ సెక్టార్ స్పెషలిస్ట్ సంగీత ఆగర్వాల్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ బయో డైవర్సిటి క్లస్టర్ కోఆర్డినేటర్ మొహమ్మద్, ప్రాజెక్ట్ హెడ్ ఫర్ ఎకాలజీ యుటేరిక్మన్ లు ఈ ప్రతినిధుల బృందం లో ఉన్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఇండో-జర్మన్ గ్లోబల్ అకాడమీలో అంతర్జాతీయ ప్రతినిధులు బృందం మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన నమూనా స్టాల్, ఏటీఎం, డిపీఎం, 5 అంతస్థుల నమూనా కేంద్రాలను సందర్శించారు. ఆ సమయంలో వాటి గురించి రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ వివరించారు.
రైతులు ప్రకృతి వ్యవసాయంవైపు అడుగులు వేసేందుకు జగన్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు సబ్సిడీ అందిస్తూనే ఆర్బీకేలలో అగ్రికల్చరల్ ఆఫీసర్ ను నియమించి ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన చేకూరేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా రసాయనాలు వాడకుండా రసాయనికయేతర పంటలపై దృష్టి సారించేలా ఇతర పద్దతుల ద్వారా అధిక దిగుబడి ఇచ్చే పంటలపై శిక్షణ తరగతులు జగన్ సర్కారు నిర్వహిస్తుంది. జగన్ ప్రభుత్వ పనితీరును ప్రకృతి వ్యవసాయ వృద్ధిపై పెడుతున్న చిత్తశుద్ధిని పరిశీలించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రశంసించింది.