బాలీవుడ్ లో అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి.. ఇప్పటికే సుకుమార్ తనదైన శైలిలో పుష్ప2 ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పుష్ప 2 నార్త్ ఇండియన్ రైట్స్ ని ఏఏ ఫిల్మ్స్ కి చెందిన అనిల్ తడాని చేజిక్కించుకున్నారు.. ఇందుకోసం ఆయన అక్షరాలా 200 కోట్లను వెచ్చించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్లే అంత మొత్తం పెట్టుబడి పెట్టడానికి కూడా వెనుకాడలేదని సమాచారం. మరోవైపు గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో పుష్ప 2 డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. పుష్ప 2 డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 250 కోట్ల రూపాయల వెచ్చించబోతున్నట్లు అదీకాక సినిమా అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే 300 కోట్ల వరకూ నెట్ ఫ్లిక్స్ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకూ ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోలేదు. పుష్ప 2 కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వల్ల మాత్రమే ఈస్థాయిలో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా డిజిటల్ రైట్స్ విషయంలో గతంలో RRR కి జరిగిన 170 కోట్లు రికార్డుగా ఉండేది కానీ ఇప్పుడు భారీ మార్జిన్ తో ఆ రికార్డును పుష్ప 2 క్రాస్ చేసింది.
కాగా పుష్ప 2లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మీక మందాన జంటగా నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది..