మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన భీమాకి కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించగా ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మరోవైపు రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో గోపీచంద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగడం వల్ల ఇదొక రొటీన్ కమర్షియల్ సినిమాగా మిగిలిపోయి డిజాస్టర్ గా నిలిచిపోయింది. ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా రవి బ్రసూర్ సంగీతం అందించారు.
ప్రస్తుతం భీమా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. భీమా మూవీ ఈ నెల 25వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి ధరకు భీమా ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25 నుండి భీమా స్ట్రీమింగ్ కానుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళం మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న భీమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేక చతికిల పడింది. ఓటిటి బాట పట్టిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి సినీ ప్రియుల్లో వ్యక్తమవుతోంది.