రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ కుంటుపడి నరకానికి అంచుల్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు 2004 లో ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రయత్నం చేస్తూ చిన్నపిల్లలకు గుండె సంబంధిత సమస్యలతో రాష్ట్రంలో వేల మంది చిన్నారులు ఇబ్బంది పడుతుంటే ఆ కుటుంబాలకు వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఒక వరంలా వచ్చి వాళ్లందరికీ ఆపరేషన్ చేయించి బతికించిన దేవుడు ఆ డాక్టర్. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా ఇచ్చిన మహాపురుషుడు ఆ డాక్టర్.
అయన కాలం చేసిన తర్వాత రాష్ట్ర వైద్య వ్యవస్థ పూర్వ స్థితికి పోయి కొట్టుమిట్టాడుతూ ఉన్న స్థితిలో ఆ డాక్టర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు . రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర లో విన్న సమస్యలను అన్ని క్రోడీకరించి ఈ రాష్ట్రానికి ఏది అత్యవసరం అని భావించి నాడు – నేడు పథకంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు అన్నిటిని మెరుగుపరిచేందుకు కంకణం కట్టుకున్న కంకణధారుడు ఆ డాక్టర్ కొడుకు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవసరాలకోసం పిహెచ్సిలను కొన్నిటిని సిహెచ్సి లు గా, సిహెచ్సి లను ఏరియా ఆసుపత్రులుగా, ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా సూపర్ స్పెషలిటీ సదుపాయాలను అందించేవిధంగా అడుగులు వేస్తూ నిధులు నియామకాలు లో కొదవ లేకుండా చూస్తూ ప్రతి ఊరిలో విలేజ్ హెల్త్ క్లీనిక్ లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థను గ్రామాల ముంగిటకు తీసుకెళ్లి రాష్ట్రంలో వైద్యం అంటే ప్రభుత్వ వైద్యశాలలు అని ప్రజలు గుర్తించుకునేలా చేస్తున్న ప్రజా నాయకుడు ఆ డాక్టర్ కొడుకు.
వీటన్నటితో పాటు వైద్య విద్య మెరుగవ్వాలి అనే ఆలోచన తో గతంలో ఎన్నడూ లేని విధంగా 75సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ జనరల్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ వైద్య విద్య, వైద్యం మెరుగవ్వాలి, తద్వారా ప్రజల వైద్య వ్యయం తగ్గితే వారి ఆర్ధిక స్థితి మెరుగయ్యి మెరుగైన జీవనం సాగిస్తారు అనే ఆలోచన తో తండ్రి ఆశయ అడుగుల్లో నడుస్తున్న ఆ డాక్టర్ కొడుకే ఈ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ హార్వార్డ్ పరిశోధనలు చేయించి పరిష్కారం కోసం పని చేసిన తండ్రి అడుగుజాడల్లో నిన్న ఉద్దానం లో డా. వైయస్సాఆర్ కిడ్నీ పరిశోధన & మల్టీ ముల్టీస్పెషలిటీ అసూయాపత్రి, డా. వైయసార్ సుజలధార పేరుతో దాదాపు 600 గ్రామాలకు రక్షిత త్రాగునీరు పధకాలను ప్రారంభించి ఆ డాక్టర్ కొడుకు సంకల్పం ఎంత గొప్పదో ఆలోచించండి.
ఈరోజు రాష్ట్రంలో దాదాపు ప్రతి మండలంలో కొత్త ఆసుపత్రి భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రజలు ఇది కదా అభివృద్ధి, మన అవసరాలు తెసులుకుని మనకోసం చేస్తున్న అభివృద్ధి అని మాట్లాడుకునేలా చేస్తున్న ఆ డాక్టర్ కొడుకే ఈ అభినవ వైతాళికుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
మీకు నమ్మకం లేకపోతే ఒకసారి మండల కేంద్రం కో , మీరు ఉంటున్న టౌన్ ప్రభుత్వ ఆసుపత్రి కో ఒకసారి వెళ్లి పరిశీలించండి గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఈ రాష్ట్రము ఇలా వైద్య రంగం లో ప్రభుత్వ ఆసుపత్రులు,