బిగ్ బాస్ రన్నర్, యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికాడు. గంజాయితో పట్టుబడడంతో షణ్ముఖ్ జస్వంత్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షణ్ముఖ్ అన్న అయిన సంపత్ వినయ్ ఒక అమ్మాయితో 10 సంవత్సరాలు ప్రేమలో ఉండి , 3 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి ఆరు రోజులు సమయం ఉండగా, 20 రోజులు ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నడు.
సంపత్ చేతిలో మోసపోయాను అని భావించిన సదరు యువతి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నార్సింగ్ పోలీసులు విచారణ నిమిత్తం సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళగా అదే ఫ్లాట్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసులను చూడగానే ఖంగుతిన్న జస్వంత్ , గంజాయిని దాచి పెట్టే ప్రయత్నం చేశాడు కానీ చాకచక్యం ప్రదర్శించి పోలీసులు గంజాయిని పట్టుకొని అతని అదుపులోకి తీసుకున్నారు. అన్నని పట్టుకోవడానికి పోలీసులు వెళితే అన్నకు తోడుగా తమ్ముడు కూడా గంజాయి సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. అమ్మాయిని మోసం చేసిన కేసులో సంపత్ వినయ్ నీ, గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు.
హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడుతుంటే , సెలబ్రిటీ ఫేం సంపాదించుకొని వ్యసనాలుకు బానిసలు కాకండి అని చెప్పడం పోయి ఇలా తరచూ సినిమా ఫీల్డ్ కు సంబంధించిన కొందరు డ్రగ్స్ తో పట్టుబడుతున్నారు. షణ్ముఖ్ పోలీసులకు దొరకడం ఇది మొదటి సారి కాదు అంతకుముందు హిట్ అండ్ రన్ కేసులో కూడా పట్టుబడ్డాడు.అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి రిలీజ్ అయ్యాడు.యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్ అనంతరం బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిసులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.