పార్టీ ఫిరాయింపులకు పాలపడ్డ వైసీపీ ఎమ్మెల్యే లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ల పై స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు..
అయితే 2014-19 మధ్య వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యే లను భయపెట్టి, ప్రలోభపెట్టి, మానసిక హింసకు గురిచేసి తన పార్టీ లోకి లాక్కున్న బాబు అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. పార్టీ ఫిరాంపులను తన రాజకీయ చాణుక్యం లా ప్రచారం చేసుకునే బాబు, తన చాణుక్యంలో భాగంగా వారి రాజకీయ జీవితాన్ని బుగ్గిపాలు చేయడం మాత్రం ఆనవాయితీనే. ఇప్పటివరకు పార్టీ ఫిరాయించి టీడీపీ లో చేరి రాజకీయంగా నిలబడిన ఏకైక వ్యక్తి చంద్రబాబే. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి అనామకుడు అయిన టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన చంద్రబాబు నెల తిరిగేలోగా టీడీపీ లోకి ఫిరాయించాడు.. అది మొదలు బాబు వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తన స్వీయ అనుభవం దృష్ట్యా కాబోలు, ఇక ఎవరు టీడీపీ లోకి వేరే పార్టీ నుండి ఫిరాయించారో వారు తనలా తయారవుతారు ఏమో అన్న భయం కాబోలు వాళ్ళకి ఏదో విధంగా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడు… 2014- 2019 మధ్య తమ పార్టీ లోకి లాక్కున్న 23 మందిలో సగం మందికి టికెట్టే ఇవ్వలేదు.. ఆ సగం మంది రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోయింది, ఇప్పుడు వారెవరూ క్రియాశీల రాజకీయంలో లేరు. ఇంకొంతమందికి టికెట్ ఇచ్చినా, అందులో ముగ్గురు ఫిరాయింపు మంత్రులు ఉన్నా ఒక్కరూ గెలవలేదు.. ఆదినారాయణ రెడ్డి బీజేపీ లో జాయిన్ అయ్యాడు, కానీ ఉన్నా లేనట్టే…
ఇక 2024 ఎన్నికల సమయానికి ఆ 23 మందిలో కేవలం ఒక్క గొట్టిపాటి రవి మాత్రమే ఎమ్మెల్యే గా గెలిచి క్రియాశీలంగా ఉన్నాడు, ఓడిపోయిన భూమా అఖిల ప్రియకు మరోసారి టికెట్ ఇచ్చారు…
ఇప్పుడు పార్టీ ఫిరాయించి అనర్హత ముద్ర పడిన వారిలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లకు టికెట్ లేదు.. అంటే బాబు ఖాతాలో ఈ 7-8 ఏళ్లలోనే 24 మంది బలి…
ఎతావాతా చెప్పొచ్చేది ఏంటంటే… బాబుది దృతరాష్ట్ర కౌగిలి, ప్రేమగా చేతులు చాపినట్లే ఉంటుంది.. కానీ కసితీరా నలిపేస్తాడు…