2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా ఎనిమిది జాబితాలు విడుదల చేసింది.
ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 9వ జాబితాను విడుదల చేసింది. నెల్లూరు పార్లమెంట్ నుంచి విజయ సాయి రెడ్డి , మంగళగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కాండ్రు లావణ్య, కర్నూల్ నుంచి ఎ.ఎండీ. ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్) లను సమన్వయకర్తలగా నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.