ఎట్టకేలకు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థి మార్పు జరిగింది. ఏడాదిగా ఆ బాధ్యత వహించిన ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో యడం బాలాజీ కి ఇన్ఛార్జిగా అవకాశం లభించింది. వైయస్ జగన్ మొదట ఆమంచిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించగా… అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆమంచికి పొసగలేదు.
అక్కడ గ్రూపుల పోరు ఎక్కువవకముందే చాకచక్యంగా జగన్ ప్రజాదరణ ఉన్న యడం బాలాజీకి ఈసారి ఆ అవకాశం కల్పించారు. మొదటి నుంచీ రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో వున్న ఆమంచి ఇటీవల పార్టీ అధినేత జగన్ ను కలిసి చీరాల నుంచి బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలిపితే తాను మద్దతు ఇస్తానని, పర్చూరు నుంచి తాను పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది.
అయితే చీరాల నుంచి కరణం వెంకటేష్‌ను అభ్యర్థిగా ప్రకటించి, ఆమంచిని పర్చూరు నుంచి పోటీ చేయమని చెప్పారు. దీనికి ఆమంచి చీరాల టికెట్టే కావాలని పట్టుబట్టడంతో అతనికి పర్చూరు నుంచి ప్రత్యామ్నాయంగా అభ్యర్థుల వేట సాగింది గొట్టిపాటి భరత్, రావి రామనాధం బాబు పేర్లు పరిశీలన లోకి వచ్చినా.. పర్చూరు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వారినే ఎన్నికల బరిలో నిలపాలని పార్టీ అధినేత జగన్ భావిస్తున్న నేపథ్యంలో యడం బాలాజీ, కంది రవిశంకర్, మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు యడం బాలాజి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.