ఈనాడు పత్రిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పైన విషం చిమ్మడానికి ఎంతలా ప్రయత్నిస్తుంది అంటే రామాయపట్నం పోర్ట్ మొదటి దశ పూర్తి చేసుకొని ప్రారంభంకి సిద్దంగా ఉంటే పచ్చ కళ్ళకు గంతులు కట్టనట్లు ఏమి అభివృద్ది జరగనట్లు వార్తను ప్రచరించింది. అక్కడికి వెళ్లి చూస్తే కదా నిజ నిజాలు తెలిసేది, 10 లక్షల ఇళ్ళకి ఈనాడు ప్రతులను ఫ్రీ గా వేస్తున్నాం కదా చెప్తే నమ్మెస్తారులే అని ధీమా కావొచ్చు , రోజులు మారాయి రామోజీ, ఇంకా ఎన్నాళ్లు ఇలా ,
చంద్రబాబు హయాంలో కంటికి భూతద్దం పెట్టి వెతికిన కనపడని అభివృద్ది నీకు మాత్రం ఎలా కనపడింది. శిలాఫలకాలు , శంకుస్థాపనలుకు చంద్రబాబు పరిమితం అయితే నీకు మాత్రం అయిపోయినట్లు కనిపిస్తుంది నీకు మాత్రమే ఎలా రామోజీ ఇలా , జగన్ ప్రభుత్వం లో పనులు పూర్తి చేసుకొని ప్రారంభం కి సిద్దంగా ఉన్నా నీ కళ్ళకి ఏమీ కనపడదు ఎందుకు.
రామాయపట్నం పోర్ట్ మొదటి విడత పనులు చివరి ప్రక్రియకు చేరుకున్నాయి. మొదటి విడత పనులు త్వరలోనే ముగించుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
2022 జూలై 20 న జగన్ ప్రభుత్వం లో 3732 వేల కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపనకి నోచుకోబడిన రామాయపట్నం పోర్ట్ 18 నెలల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడనికి సిద్దంగా ఉంది. చిత్త శుద్ధి ఉంటే పనులు త్వరతగితిన అవుతాయి అన్నదానికి ఇదే నిదర్శనం.ఈ పోర్ట్ ద్వారా ఏడాదికి 138 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసేందుకు అనువుగా ఈ పోర్టులో మొత్తం 19 బెర్త్‌లను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో “రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్” క్రింద చేపట్టింది.
డ్రెడ్జింగ్, రిక్లమేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశలో ఏటా 34 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేయడానికి 4 బెర్త్‌ల నిర్మాణం పూర్తి అయింది.
చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ కు రామాయపట్నం పోర్ట్ ఒక అదనపు బలం. మల్టీ కార్గో ఆపరేషనల్ పోర్ట్ గా అభివృద్ధి కానున్న రామాయపట్నం పోర్ట్, ఇప్పటికే మొదటి బెర్త్ పనులు పూర్తి కాగా , పోర్ట్ కు అనుకునే NH16 జాతీయ రహదారి, దానికి అనుకునే కార్గో ఆపరేషనల్ దృష్ట్యా కార్గో విమానశ్రయము నిర్మాణ కొరుకు అడుగులు పడుతున్నాయి.ఒక వైపు పోర్ట్ పనులు జరుగుతున్నాయి , మరో వైపు ప్రభుత్వం 8000 ఎకరాల భూసేకరణ చేపట్టి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కొరుకు పనులని వేగవంతం చేసింది. లోకల్ గా ఉన్న ప్రజలకి మేలు చేకూర్చేలా ఉద్యోగ కల్పన లో 70 శాతం స్థానికులు కు 30 శాతం నాన్ లోకల్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కోటలో నుండి బయటకి వచ్చి చూడు రామోజీ, అన్ని కనపడతాయి.