నిద్ర లేమి అతి ప్రమాదకరమైన జబ్బు . కేన్సర్ కూడా నిదానంగా నెలల వ్యవధిలో కబలిస్తుంది కానీ రోజుల తరబడి నిద్ర పోకుండా ఉంటే అతి త్వరలోనే తీవ్ర దుష్పరిణామాలు సంభవించటం ఖాయం .
మొదటి రోజు నిద్రపోకపోతే అలసట , తలనొప్పి , చికాకు లాంటి సాధారణ సమస్యలు వస్తాయి .
అదే రెండోరోజు కూడా నిద్ర పోకపోతే నీరసం , ఆకలి వెయ్యకపోవటం , అసహనం , తీవ్రమైన తలనొప్పి లాంటి సమస్యలు చుట్టుముడతాయి .
మూడు , నాలుగు రోజులకి న్యూరో కాంప్లికేషన్స్ మొదలవుతాయి . న్యూరో లాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు . తీవ్ర అసహనంతో సంయమనం కోల్పోయి అరవడం , పిచ్చి పనులు చేయడం , జుట్టు పీక్కోవడం , గుడ్లురమడం లాంటివి చేస్తారు . బ్రెయిన్ సరైన సందేశాలు ఇవ్వలేదు .
ఐదు , ఆరు రోజులకి బ్రెయిన్ పాడైపోతుంది , అస్తవ్యస్తంగా ప్రవర్తించడం , దగ్గరి వారిని కూడా గుర్తు పట్టలేని విధంగా మెంటల్ హెల్త్ పాడైపోతుంది . మలమూత్రాల విసర్జన కూడా తెలియకుండానే బట్టల్లో జరిగిపోతాయి .
ఏడవ రోజుకి హృదయ విదారకమైన మరణం సంభవిస్తుంది . ఇంతకన్నా ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని గతంలో సంఘటనలను ఉదహరిస్తూ బలంగా చెప్తున్నారు అనుభవజ్ఞులైన వైద్యులు .
మరి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసే వరకూ నిద్రపోను అని శపథం చేసి నేటికి ణాలు సంవత్సరాలు అవుతుంది .
ఇన్ని రోజులూ మాటమీదే నిలబడి నిద్రపోకుండా ఎలా బతికాడో ఏ డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు .
అందరి నోటా ఒకటే మాట ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ .
వైద్య శాస్త్రంలో ఇదొక మహాద్భుతం .