ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామంటూ టీడీపీ పార్టీ రాజమండ్రిలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఎన్నికలకు దాదాపు సంవత్సరం ముందు మే28 , 2023 లోనే మిని మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. అయినా అమలు చేసే పార్టీకి ఆలోచన కానీ హామీలిచ్చి మర్చిపోయే టీడీపీకి ఏం ఆలోచన. ఏ తమ్ముళ్ళూ ఈ తమ్ముళ్ళూ అనుకుంటూ మైకు దొరకగానే ఏదేదో సోదంతా చెప్పే చంద్రబాబుకు ఏం భయం. టీడీపీ అధికారంలోకి వస్తే బాగుపడేది ఆ పార్టీ నాయకులు, ఆయన అసలు కొడుకు, కొసరు దత్తపుత్రుడు మాత్రమే. ప్రజలకు ఏ మంచీ జరగదు.
అసలు పంచాయితీ ఎలక్షన్స్ కు మేనిఫెస్టో ఇవ్వడమే అతి అనుకొంటే ఆ పంచాయితీ మేనిఫెస్టో కూడా తుంగలో తొక్కింది టీడీపీ పార్టీ. 2021 జనవరిలో స్థానిక పంచాయితీ ఎన్నికలకు గానూ తాము గెలిచిన పంచాయితీలలో ప్రతి గ్రామంలో త్రాగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి సురక్షితమైన త్రాగు నీరు అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ టీడీపీ గెలిచాము అని చెప్పుకొంటున్న 4230 పంచాయితీలలో ఎక్కడా సురక్షిత త్రాగునీరు అందిస్తున్న దాఖలాలు మనకు కనపడవు.
అంతేకాదు 2014 ఎన్నికల హామీలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట రాష్ట్రంలో ప్రతి గ్రామంలో , పట్టణ వార్డులలో సురక్షిత త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి 20 లీటర్ల మంచినీటి కేన్ 2 రూపాయలకే ఇంటింటికీ అందిస్తామన్నారు. అవెక్కడున్నాయో మరి కనపడకుండా ప్రజలతో దాగుడుమూతలు ఆడుతున్నాయనుకుంట.
2015 లో కొన్ని గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా రోజుకు 20 నుండి 30 గ్రామాలకు మాత్రమే మంచినీళ్ళు అందించగలిగారు. ఆ తరువాత ఎప్పటికప్పడు దాతలను వెతకాలంటూ అధికారులను ఆదేశించడమే కానీ ఎప్పుడూ సుజల స్రవంతి పథకం అమలు కాలేదు.
2016 సంవత్సరానికి టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా సుజల స్రవంతి పేరున నీరెక్కడా పారలేదు. కొద్ది నిధులతో పూర్తిచెయ్యగల పథకాన్ని పూర్తిచెయ్యకుండా, దాతల సహకారంతో వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసినా, నిర్వహణ భారంతో వాటిలో సగానికి పైగా మూతపడ్డాయి. దీంతో సుజలం విఫలమైంది.
ఫ్లోరైడ్‌తో అష్టకష్టాలు పడుతున్న ప్రకాశం జిల్లాకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అందరూ ఆశించారు. అయితే బాబు నాలుగేళ్ల పాలన ముగిసినా ఈ పథకం ద్వారా జిల్లావాసులకు గుక్కెడు నీరందలేదు. ప్రకాశం జిల్లాలో జూన్, 2018 వరకు ఎలాంటి కుళాయిలు కనపడలేదు.. అయితే ఈ పథకాన్ని రన్ చెయ్యడానికి దాతలను వెతకాల్సిందిగా ప్రభుత్వం గ్రామీణ తాగునీటి పథకం అధికారులను ఆదేశించింది. ఇలా ప్రజలను మోసం చెయ్యడమే కాకుండా టీడీపీ ఎన్టీఆర్ గారి పరువు కూడా తీసింది.
2014 లో చంద్రబాబును చూసో, ఆయన పసుపు రంగు మేనిఫెస్టో చూసో ప్రజలు ఒకసారి గెలిపించారు. గెలిచి అధికారంలోకి వచ్చాక రకరకాల హామీలతో ముద్రించిన మేనిఫెస్టోను సైతం అధికారిక పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిన గొప్ప ఘనత చంద్రబాబుది. మళ్ళీ 2019 ఎన్నికల ముందు మరో డ్రామా.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందంగా రాజకీయ పార్టీల రంగులు, గుర్తులు కూడా కనిపించకుండా జరిగే పంచాయితీ ఎన్నికలకు 2021 లో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది.
ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా మే, 2023 లో మినిమేనిఫెస్టో అంటూ సరికొత్త నాటకం మొదలుపెట్టారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏడవలేని ఏడుపు 2024 లో వస్తే ఏం ఏడుస్తారో ఏమో మరి. అయినా చంద్రబాబు నాయుడుకు ఈ మేనిఫెస్టోల పిచ్చేంటో అసలు అర్ధమే కాదు. పంచాయితీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో ఇచ్చిన మహానుభావుడు. ఎప్పటికప్పుడు పసుపు రంగుల్లో, చక్కని చంద్రబాబు చిరునవ్వుతో పేజీలకొద్దీ హామీలతో కొత్త కొత్తగా రకరకాలుగా మేనిఫెస్టోలు తయారు చేయడం టీడీపీ హంగుఆర్భాటాలకు ప్రతీక. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ మేనిఫెస్టో చదవడానికే గానీ గెలిచాక ఏ ఒక్క హామీని ఆ టీడీపీ పార్టీ అమలు చెయ్యదు.