దివంగత నటుడు,రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ మరోసారి తెరపై కనపడనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏఐ టెక్నాలజీ సాయంతో విజయ్‌కాంత్‌ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే దళపతి విజయ్ 68 వ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం రూపొందుతుంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ,ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్ మరియు జయరాం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో విజయ్‌కాంత్‌ను ఎలా చూపించబోతున్నారా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా విజయ్‌కాంత్‌ను ఏఐ వెర్షన్‌ను చూపించే విషయంలో తన అనుమతి కోసం వెంకట్ ప్రభు ఇప్పటికే చాలాసార్లు తనను కలిసారని విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, విజయ్‌కాంత్ కాంబినేషన్లో రూపొందే సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అనంతరం విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరోస్థాయిలో ఉన్నాయి.