గత కొద్దిరోజులుగా ఏ సర్వే చూసినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన జన్ మత్ పోల్స్ సర్వే కూడా ఏపీలో ఫ్యాన్ హవా కొనసాగనుందని తేల్చి చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 19 లోక్ సభ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. 47.6% ఓట్ షేర్ సాధించే అవకాశం అధికార వైఎస్సార్సీపీకి ఉందని టైమ్స్ నౌ సర్వే అభిప్రాయ పడింది.
వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి 2024 వరకూ టైమ్స్ నౌ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జగన్ ప్రభంజనం కొనసాగనుందని తేటతెల్లమైంది. టీడీపీ-జనసేన కూటమికి 44.4% ఓట్ షేర్ మాత్రమే దక్కే అవకాశం ఉందని తద్వారా 6 ఎంపీ స్థానాలను ఆ కూటమి దక్కించుకోనుందని టైమ్స్ నౌ వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.5% ఓట్ షేర్ మాత్రమే దక్కనుండగా మరోవైపు బీజేపీకి 2.1% ఓట్ షేర్ సాధిస్తుందని ఇతరులు 4.4% ఓట్ షేర్ కొల్లగొట్టనున్నారని కానీ ఏపీలో కాంగ్రెస్ & బీజేపీ పార్టీలు ఖాతా తెరిచే అవకాశం లేదని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. దీంతో స్పష్టమైన మెజారిటీతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ సర్వే ద్వారా తేటతెల్లమైంది