ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ ఓటు వైఎస్ఆర్సీపీకేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు తరువాత టైమ్స్ నౌ ఏపీలో సర్వే చేపట్టింది. తెలంగాణ ఎన్నికల తరువాత.. ఆ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందనే విశ్లేషణలు చేసే వారి అంచనాలు తప్పని టైమ్స్ నౌ సర్వే లో తేట తెల్లమైంది.
2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి 24-25 సీట్లు వస్తాయని, టీడీపీకి కేవలం ఒక సీటు వచ్చే అవకాశముందని, జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని టైమ్ప్ నౌ సర్వే వెల్లడించింది. అంతేగాకుండా వైఎస్ఆర్సీపీకి 50 శాతం ఓట్లు, టీడీపీకి 37 శాతం ఓట్లు, జనసేనకు 10 శాతం ఓట్లు, బీజేపీ , ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ప్రస్తుత సర్వే ప్రకారం 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ బ్యాంక్‌ను అధికార వైఎస్ఆర్సీపీ నిలుపుకుంటే, టీడీపీ మాత్రం ఒక్కశాతం ఓటు బ్యాంకును కోల్పోయి 37 శాతానికి పరిమితం కాగా జనసేనకు మాత్రం నాలుగు శాతం ఓటింగ్ పెరిగి 10 శాతానికి చేరుకుంటుంది.
టైమ్స్ నౌ సర్వేలో ఏకపక్షంగా ఫలితం రావడానికి పలు కారణాలున్నాయి . జగన్ సుపరిపాలన ప్రజలు మెచ్చేలా సాగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు అవినీతి పరుడని, వ్యవస్థలను మేనేజ్ చేయగలడని ఏపీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, టీడీపీని నడపటం లోకేష్ వల్ల కాదని ఆ పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు, యువ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. మెజారిటీ ఏపీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రజలంతా పవన్‌ను ఇప్పటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడిగా, కాపు నాయకుడుగానే పరిగణించడం, పవన్‌కు పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు.
మరోవైపు సీఎం జగన్ మీద రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడం వల్ల ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. నాడు – నేడుతో ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయడం, చరిత్రలో ముఖ్యమంత్రి చేయని విధంగాడీబీటీ (డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్), నాన్ డీబీటీ ద్వారా సుమారు 5 లక్షల కోట్లను ప్రజలకు ఖర్చు చేయడం, 54 నెలల జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందడంతో జగన్ ప్రభుత్వానికి ఎనలేని ఆదరణ దక్కుతుంది. కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా ఏపీలో వైఎస్ జగన్ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసినట్లయింది
TIMES NOW- @ETG_Research Survey
Who will win how many seats in Andhra Pradesh?
Total Seats- 25
– YSRCP: 24-25
– TDP: 0-1
– JSP: 0
– NDA: 0Watch @TheNewshour as @NavikaKumar also takes us through seat share projections from K’taka, Tamil Nadu, Assam & Telangana. pic.twitter.com/O8FcOFcojh
— TIMES NOW (@TimesNow) December 13, 2023