టీడీపీ పార్టీ అవిర్భవించిన తరువాత శృంగవరంకోట నియోజకవర్గంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయింది. అలాంటి కంచుకోట లాంటి శృంగవరంకోట నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత మూడు సార్లు టీడీపీ తరుపున కోళ్ల లలితకుమారి పోటీ చేసి 2009, 2014 లో గెలిచి 2019 లో ఓడిపోయారు. అ తరువాత ప్రజలతో సంబంధాలను కోల్పోయారు, ఆలాగే టీడీపీ కార్యకర్తలు కూడా కోళ్ల లలితకుమారి మీద వ్యతిరేకం అయ్యి టికెట్ ఇవ్వద్దు అని గొడవలు చేశారు. ఇదాంత గమనించిన చంద్రబాబు నాయుడు ఎన్నారై గొంప కృష్ణను పిలచి టికెట్ ఇస్తామని ఎస్ కోట నియోజకవర్గంలో పని చేసుకోమని ఆదేశించారు. లోకేష్ పాదయాత్రకు , చంద్రబాబు నాయుడి సభలకు ఖర్చు పెట్టించి చివరకు ఎస్ కోట టికెట్ కోళ్ల లలితకూమరి కే కేటాయించారు. ఇదే కోట నియోజకవర్గంలో టీడీపీని నిట్టనిలువునా చీల్చింది.
కోళ్ల లలితకుమారి పోటీ చేస్తారు అని చంద్రబాబు నాయుడు ప్రకటించగానే గొంప కృష్ణ కన్నీరు కారుస్తూ చంద్రబాబు నాయుడు నమ్మించి వెన్నుపోటు పొడిచారు. పార్టీకి దిక్కులేని టైంలో నేను ఇంచార్జీగా తీసుకుని ప్రతి గ్రామంకు మళ్ళీ పార్టీనీ తీసుకువెళ్ళాను ఇంతా చేసి పార్టీని గెలుపు శిఖరాలకు చేర్చే టైంలో కోళ్ల లలితకుమారి కి ఎలా టికెట్ కేటాయిస్తారు అని నేను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న అని ప్రకటించారు. ఇక్కడ గమ్మత్తు అయిన విశేషం ఏమిటంటే నియోజకవర్గంలో మెజారిటీ మండలాల టీడీపీ నేతలు గొంప కృష్ణకే తమ మద్దతు అని ప్రకటించారు. కోళ్ల లలితకుమారికి నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తల నుండి సపోర్ట్ దక్కటం లేదు.