‘జనసేన ఆడియో ఫంక్షన్ బాగా జరిగింది’ ఆ పార్టీ ప్రారంభోత్సవం రోజున సోషల్ మీడియాలో పేలిన సెటైర్ ఇది. అందుకు తగినట్లుగానే సేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుంటారు. చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీగా దీనికి ప్రజల్లో పేరుంది. పవన్ అభిమానులు ఎంతో ఆశిస్తుంటారు. పవర్ మాకే వస్తుందని గెంతులు వేస్తుంటారు. కానీ అధినేత మాత్రం తెలుగుదేశం కోసం మాత్రమే పనిచేస్తారు. సింబల్ విషయంలో గతంలో జనసేన ఎప్పుడూ సీరియస్గా లేదు. దీంతో అది ఫ్రీ సింబల్ అయింది. ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉండటం, వచ్చే ఎన్నికల్లో సేనను పోటీ చేయించాలని బాబు భావించడంతో ఈసారి గుర్తు కోసం ప్రయత్నించింది. కేంద్ర ఎన్నికల సంఘం తమకు గాజుగ్లాసునే కేటాయించిందని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ–మెయిల్ ద్వారా అందాయని సేన పెద్దలు వెల్లడించారు.
విచిత్ర సేన
చంద్రబాబు దత్తపుత్రుడిగా పిలవబడే పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్. దత్తతండ్రికి అవసరమైనప్పుడు క్షేత్రస్థాయిలోకి వచ్చి జగన్, వైఎస్సార్సీపీని తిట్టి వెళ్లిపోతుంటారు. ఈయన 2014లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. నేను అధికారం కోసం రాలేదు. ప్రజల కోసం వచ్చానని ఘనంగా ప్రకటించారు. 2019లో చంద్రబాబు ఆదేశాలతో కమ్యూనిస్ట్లు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాలేదు. స్వయానా పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ను సీఎం కానివ్వను.. ఇది నా శాసనం అన్నారు. అయితే ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పెట్టారు. సేనానితో పొత్తు పెట్టుకున్నందుకు కమ్యూనిస్టులు తమను తాము తిట్టుకున్నారు. ప్రస్తుతం అటు బీజేపీ, ఇటు టీడీపీతో సేన పొత్తులో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ, బీజేపీలు పొత్తులో లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు సేనాని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పార్టీ సింబల్ విషయానికొస్తే రాజకీయాల్లో ఇది చాలా కీలకం. కానీ సేనకు కాదు. 2019లో పోటీ చేస్తున్న సమయంలో ఎన్నికల సంఘం గాజుగ్లాసును కేటాయించింది. అయితే నిబంధనల ప్రకారం సేనకు ఓట్ల శాతం రాలేదు. దీంతో సింబల్ కాస్త ఫ్రీ అయిపోయింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ భయపడింది. దీంతో గాజుగ్లాసును ఈసీ స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది. బద్వేల్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే జరిగింది. 2024 ఎన్నికల్లో సింబల్ లేకపోతే నష్టపోతామని బాబు, పవన్ భావించి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వారికి గాజుగ్లాసు దక్కినట్లుగా తెలుస్తోంది. జన సైనికులు ఎన్ని అనుకున్నా.. ఊహల్లో తేలినా.. ఈ గ్లాసులో ఏదైనా పోసుకుని తాగేది తెలుగుదేశం మాత్రమే. దానికే అన్ని హక్కులను పవన్ రాసిచ్చేశాడనేది అందరికీ తెలిసిన విషయమే..