Home »andhra pradesh » The Fourth Assembly Is Ready In Medarametla Of Bapatla District
బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం నాలుగో సభ
ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలిలో , కోస్తాంధ్ర లోని దెందళూరులో , రాయలసీమ లోనీ రాప్తాడులో సభలు జరగగా, నాలుగవ సిద్ధం సభను మేదరమెట్లలో ఏర్పాటు చేయనున్నారు .
వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంకు తన కార్యకర్తలను సన్నద్ధం చేసుకుంటూ సిద్ధం అనే పేరుతో సభలు నిర్వహిస్తూ తన కార్యకర్తలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఈనెల మార్చి 3న జరగబోయే సిద్ధం సభ కోసం బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా నిర్ణయించినట్లు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలిలో , కోస్తాంధ్ర లోని దెందళూరులో , రాయలసీమ లోనీ రాప్తాడులో సభలు జరగగా, నాలుగవ సిద్ధం సభను మేదరమెట్లలో ఏర్పాటు చేయనున్నారు . ఇప్పటి వరకు జరిగిన మూడు సభలు భారీ విజయవంతం కాగా నాలుగో సభను కూడా గత మూడు సభలు లాగే విజయవంతం చేస్తామని సాయి రెడ్డి తెలిపారు.
మొదటి సభకు 4 లక్షల నుంచి 5 లక్షల మంది హాజరు అవ్వగా , దెందలూరు సభకు 6 లక్షల నుంచి 7 లక్షల మంది హాజరు అవ్వగా. రాప్తాడులో జరిగిన సభకు 11 నుంచి 12 లక్షల మందికి హాజరయ్యారు అని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. మేదరమెట్లలో జరిగే ఈ సభకు కూడా 10 లక్షల మంది పైగా రావచ్చు అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. సిద్ధం నాలుగో సభలో రైతులకి, మహిళలకి సంభందించి కీలక ప్రకటన చేయనున్నట్లు వినికిడి. ఇలా వరస సభలు పెట్టుకుంటూ , కార్యకర్తలను ఉత్తేజ పరుచుకుంటూ, సిద్ధం అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.