ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పెత్తందారుల పోకడలను ఓ టీడీపీ ఎన్నారై బట్టబయలు చేసాడు. ఓటర్లను వెధవలంటూ వారిని డబ్బుతో కొనేయమని తన తోటి ఎన్నారైలకు నూరి పోసాడు. ఇప్పుడీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.
వివరాల్లోకి వెళితే ఎన్నారై టీడీపీ రీచ్ ఏపీ మీట్ అనే చిన్న సభలో ఎన్నారై యూఎస్ఏ సెల్ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తోటి ఎన్నారైలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ మనకు ఓటు వేయని వెధవలను మార్చే ప్రయత్న చేయాలని, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయని అలాంటి కుటుంబాలను మారిస్తే ఈజీగా నాలుగైదు ఓట్లు పడతాయని, ఒక్కో నియోజక వర్గంలో దాదాపు 1000 ఓటర్లను మార్చినా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని వెల్లడించారు. అందుకోసం అవసరం అయితే రెండు మూడు లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడకూడదని మనకి రెండు మూడు లక్షలు ఇవ్వడం చాలా చిన్న విషయమని చెప్పుకొచ్చారు.
కోమటి జయరాం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగింది. ఓటర్లను వెధవలు అంటూ సంబోధించడం, ప్రలోభాలకు గురి చేసైనా కుటుంబాలను మార్చాలనే టార్గెట్ ఇవ్వడంపై పలువురు మండి పడుతున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీడీపీ తీవ్రంగా దిగజారిపోతుందని డబ్బు ఎరగా వేసి పాలించాలనే పెత్తందారుల్లా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నారైలంటే దేశంపై ప్రేమతో ఉంటారని కానీ కోమటి జయరాం లాంటి ఎన్నారైలు పార్టీపై ప్రేమతో ఉచ్చ నీచాలు కూడా చూడటం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయాలని సామాన్యులు సైతం సూచిస్తూ ఉండటం విశేషం. ఇదే ధోరణి కొనసాగితే మరోసారి ఏపీలో వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా కోమటి జయరాం వ్యాఖ్యల కారణంగా టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడింది. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.