గతంతో పోలిస్తే రాష్ట్రంలో కనీవినీ రీతిలో ధరలు పెరిగాయని టీడీపీ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. టీడీపీకి వంత పాడుతూ ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారం అంతాఇంతా కాదు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొంతకాలం పాటు దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా, తరువాత ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని కొత్త పల్లవి ఎత్తుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలోని మొదటి తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లేకపోవడం విశేషం. దీన్నిబట్టి టీడీపీతో కలిసి ఎల్లో మీడియా ప్రభుత్వంపై ఏ విధంగా బురద జల్లుతుందో తేటతెల్లమవుతుంది.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన జాబితాలో భారత దేశంలో ఒక మనిషి జీవించేందుకు అయ్యే ఖర్చు గత సంవత్సరంతో పోలిస్తే 5.69% పెరగ్గా అత్యధికంగా మణిపూర్ లో 12.86% పెరగడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తొలి తొమ్మిది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. మణిపూర్ తరువాత అత్యధికంగా 8.73 % ద్రవ్యోల్బణంతో ఒడిస్సా రెండో స్థానంలో, 7.07% ద్రవ్యోల్బణంతో గుజరాత్ మూడో స్థానంలో నిలవగా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 6.65% ద్రవ్యోల్బణంతో ఏడవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో కేవలం 5.52% ద్రవ్యోల్బణంతో పదవ స్థానంలో నిలిచింది.
దేశంలో పెరుగుతున్న సగటున పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం తక్కువ కావడం విశేషం. దేశంలో సగటు ద్రవ్యోల్బణ రేటు 5.69% కాగా రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణ రేటు 5. 52% కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని వెల్లడిస్తుంటే ఆ ఫలితాలను దాచిపెట్టి చంద్రబాబుతో కుమ్మక్కైన ఎల్లో మీడియా రాష్ట్రంలో ధరలు పెరిగాయని దుష్రప్రచారం చేయడం ఖండించాల్సిన విషయం. పలు సర్వేల్లో బట్టబయలు కావడంతో 2024లో జరగబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ, అసత్య ప్రచారాలు చేసైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ గమనిస్తూ అసహ్యించుకుంటున్నారు. ఇలాగే అవాస్తవాలను ప్రచారం చేస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం ఖాయంగా కనిపిస్తుంది.