ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజున టీడీపీ నేతలు చేసిన అరాచకాలకు చట్టపరమైన యాక్షన్స్ మొదలయ్యాయి. రిగ్గింగ్, ఈవీఎం ధ్వంసం చేయడం, ఓటర్లపై దాడులు చేయడం లాంటి చర్యలపై సిట్ బృందం దర్యాప్తు చేసి నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా తుమ్రాకోటలోని 203,204,205, 206 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ, సైదులు, మహేష్ లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.
అయితే ఎన్నికల రోజు చట్ట వ్యతిరేక పనులకి పాల్పడిన మరో 50మంది టీడీపీ కార్యకర్తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చెపట్టినట్టు తెలుస్తుంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు అలాగే పల్నాడు జిల్లాలో 22, అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..