ఓ భూ వివాదంలో అరెస్ట్ చేసేందుకు వచ్చిన తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి ఓ తెలుగుదేశం నాయకుడు పరారయ్యాడు. ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల లోక్‌సభ టీడీపీ ఇన్చార్జిగా మాండ్ర శివానందరెడ్డి ఉన్నారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి. హైదరాబాద్‌లో చాలాకాలంగా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఉద్యోగంలో ఉంటూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఆరోపణలున్నాయి. అనేక భూవివాదాల్లో తలదూర్చినట్లు సమాచారం ఉంది. డబ్బు బాగా సంపాదించి వీఆర్ఎస్ తీసుకున్నారని చెబుతారు. ఆయనపై హైదరాబాద్‌లో భూ వ్యవహారానికి సంబంధించిన కేసు నమోదైంది. దాని నంబర్ 194/2022లో. దీనిపై ఆయన్ను అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఉత్తర్వులు వెళ్లాయి. దీంతో సీసీఎస్ సిబ్బంది నందికొట్కూరు మండలం అల్లూరులో శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు.
మొదట నోటీసులిచ్చి తీసుకెళ్లాలని శివానందరెడ్డి పోలీసులకు చెప్పారు. వాళ్లు అవి తయారు చేస్తుండానే ఆయన అక్కడి నుంచి కారులో పరారయ్యారు. తెలంగాణ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా మాండ్ర అనుచరులు ఆపేశారు. ఈ సమయంలో కొంత హైడ్రామా చోటుచేసుకుంది. నోటీసులు తయారు చేసే సమయంలో.. మాండ్ర తన ముఖ్య అనుచరులకు చెప్పి పరారయ్యేందుకు ప్రణాళిక వేసుకున్నారు. తాను బయటకు వెళ్లిపోయాక పోలీసులు వెంటపడకుండా గేట్లకు తాళం వేసేశాడు. దీంతో వారు అక్కడ చిక్కుకుపోయారు.
ఎల్లో గ్యాంగ్ ఈ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చుట్టాలని చూస్తుందేమో. అలా చేస్తే ప్రజల్లో అభాసుపాలవడం ఖాయం. ఎందుకంటే శివానందరెడ్డి దందాలు చేసింది హైదరాబాద్‌లో.. ప్రస్తుతం అక్కడ సీఎంగా ఉంది చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి. అయినా జగన్ కుట్ర అని ప్రచారం చేస్తే అందరూ ఉమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.