అధికారాంతమున చూడవలె నయ్యగారి సౌభాగ్యముల్ అని కాళిదాసు శాకుంతలం లో ఒక పద్యం ఉంది. నీచుడికి అధికారం వస్తే వాడికి మంచి మాటలేవీ వినపడవు.బధిరుడవుతాడు.చూపు మందగిస్తుంది. అంటే మంచిని గ్రహించడు
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు. లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
ఇది మన రాజు అక్షరాలా వర్తిస్తుంది. ఆయన పౌర విమాన యాన మత్రిగా అధికారంలో ఉన్నపుడు, చేసిన పనులు అలా ఉన్నాయి. పైగా గొప్పగా చెప్పుకోవడం కూడా!
సాధారణంగా విమానంలో వెంట తీసుకెళ్ళడానికి అనుమతించని కొన్ని నిషేధిత వస్తువులు ఉంటాయి. కత్తులు, బ్లేళ్ళు, అగ్గిపెట్టెలు వంటివి.
అయితే ఆయన స్వయంగా పౌర విమాన యాన మంత్రి కావడం వల్ల ఆయనకు అప్పట్లో తనిఖీ ఉండేది కాదట. “నేను సిగరెట్లు తాగుతా. నన్ను తనిఖీ చేయడం మానేయగానే, నేను అగ్గిపెట్టె కూడా పట్టుకెళుతున్నా” అని స్వయంగా తను వాడే పోర్టబుల్ యాష్ ట్రే ని తీసి ఒక విలేకరుల సమావేశంలో చూపించారు. ఇంకా నయం, మంత్రినే కదా అని సీటు కింద విదిలించాడు కాదు
ఇంకా ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడాయన .”భద్రత అనేది అర్థ వంతంగా ఉండాలి గానీ అర్థ రహితంగా ఉండకూడదు” అట.
విమానంలో అగ్గి పెట్టె తీసుకువెళ్ళడం అనుమతిస్తే ఎలాటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆయనకు తెలిసే ఈ మాట అన్నాడో మతి లేకుండా అన్నాడో ఆయనకే తెలియాలి.
తెలివైన విలేకరి ఒకరు “అయితే భారతీయులందరూ ఇలా అగ్గిపెట్టెలు తీకెళ్ళాలంటారా విమానాల్లో?” అని అడిగితే డొంక తిరుగుడు గా ” పొగ తాగడం మంచిది కాదు” అని ఆరోగ్య సూత్రాలు ఎత్తుకున్నాడు.
అట్లుంటది రాజుగారి తోని
కట్ చేస్తే.. నిన్న మొన్న ఒక ఫొటో వైరల్ అయింది. “రాజు గారు ఎంత నిరాడంబరంగా ఉంటారో చూడండి” అని రైల్వే స్టేషన్ లో అరుగు మీద సామాన్లతో ట్రైను కోసం ఎదురు చూస్తూ అశోక గజపతి రాజు కూచున్న ఫొటో
ఆయనేమీ పాసెంజర్ ట్రైన్ కోసం చూస్తూ కూచోలేదు. ఏదో ఎక్స్ ప్రెస్ రైల్లో ఫస్ట్ క్లాస్ బోగీ కోసం ఎదురు చూస్తూ, అధికారంలో లేడు కాబట్టి, సింప్లిసిటీ ని ప్రదర్శిస్తూ రైల్వే స్టేషన్ లో అరుగు మీద కుటుంబంతో కూచున్నాడు. పనిలో పని ఫొటో పేపర్లో పడితే జనం ఒకసారైనా గుర్తు పడతారు, నిరాడంబరత్వానికి కాస్త పబ్లిసిటీ కూడా దక్కక పోతుందా అని.
పాత వార్తలు తవ్వి తీసి చూస్తే, ఈ కొత్త ఫొటోల విలువ అకస్మాత్తుగా పడిపోతూ ఉంటుంది
తొందర పడి, ఆయనకు అంతంత గొప్ప గౌరవాలు ఇచ్చేయకండి
మరొక సారి పద్యం ముక్క చదువుకోండి “అధికారాంతమున చూడవలె అయ్యగారి సౌభాగ్యముల్”