ఇండస్ట్రీ 4.0 పేరుతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైజాక్ రాడిసన్ బ్లూ వేదికగా నిర్వహించిన నేషనల్ స్కిల్ కాంక్లేవ్ 2024 కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఆర్థిక, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, ప్లానింగ్ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అరిజోనా స్టేట్ యూనివర్శిటీ వారి 100 మిలియన్ లెర్నర్స్, ట్రస్టెడ్ జాబ్స్ తాత్విక్ బ్యూటీ, వెల్ నెస్, టైయిన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్‌ఏఐ) ఎక్సెల్ ఐఆర్, జీయూవీఐ, హెచ్ ఈఆర్ ఈ టెక్నాలజీస్ వంటి సంస్థలతో ఏపీపీ ఎస్‌ఎస్‌టీసీ ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో ఏపీ తరపున మొత్తం 8ఎంవో యూలు కుదుర్చుకున్నామని బుగ్గన స్పష్టం చేశారు. స్కిల్ కాస్కేడింగ్ పారడైమ్ తో పాటు ఏపీఎస్ఎస్టీసీకి సంబంధించిన న్యూస్కిల్ అనే న్యూస్ లెటర్‌ను ఆయన ఆవిష్కరించారు.
నైపుణ్యం లేని రంగంలో రాణిస్తోన్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్, ట్రైనింగ్ పార్టనర్, ట్రైనింగ్ సెంటర్లకు మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఏపీలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామని, గత 30-40ఏళ్ల కాలంలో నైపుణ్య రంగంలో చాలా మార్పులొచ్చా యన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న వనరుల్నిబట్టి అవకాశాలు సృష్టించామన్నారు.
గత అయిదేళ్ళలో ఏపీకి సంబంధించి నిర్వహించిన కార్యక్రమాలని తెలిపేలా వీడియోని ప్రదర్శించారు. ఈ సందర్భంగా బెస్ట్ ప్లేస్మెంట్ పార్టనర్లగా కియా మోటార్స్, లలితా జ్యువలరీ సంస్థలు ఎంపికయ్యాయి.