స్కిల్ డెవలప్మెంట్ కేసును మంగళవారం ఏసీబీ కోర్టు విచారించనుంది. గతంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏ–1 అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏ–22 నిందితుడు యోగేష్ గుప్తాది నిధుల అక్రమ తరలింపులో కీలకపాత్ర అని ఏ–13 నిందితుడు చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఈæ కేసులో ఏ– 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ 2016లో తనని కలిశారని వెల్లడించారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరఫున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా.. ఇందుకుగానూ రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో జమచేశారన్నారు. అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకు మళ్లించానని షా తెలిపారు. ఇదిలా ఉండగా ఆ 65 కోట్ల రూపాయలు టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈనెల 16వ తేదీన స్కిల్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాబు క్వాష్ పిటిషన్పై ఇద్దరు జడ్జిల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే కేసును కొట్టేయలేమని కోర్టు వెల్లడించింది.