స్కిల్ డెవలప్మెంట్ పేరు చెపుతుంటే వణికిపోతున్న తెలుగు తమ్ముళ్ళకి ఇప్పుడు ఆ పేరు వింటే మరింత ఉలికిపాటు కలిగేలా ఉంది. జగన్ గత రెండేళ్లలో 3.60 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్టు వచ్చిన వార్త టీడీపీకి రుచించేలా లేదు. బాబు హాయాంలో పూర్తిగా భ్రష్టు పట్టించి, తప్పుల తడకగా, కుంభకోణాలమయంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఇప్పుడు వినూత్న రీతిలో పని చేస్తూ, నైపుణ్యాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతూ లక్షలాది మందికి శిక్షణ ఇవ్వడమే కాక, 1.81 లక్షల మంది యువతకు ఉపాధి కూడా కల్పించింది.
ఈ శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా గత రెండేళ్లలో 3,60,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి 1. 81 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 లక్షల 60 వేల మందికి వివిధ రంగాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వగా వారిలో ఇప్పటికే లక్షా 81 వేల మందికి పలు కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు.
ఇంకా ఈసమావేశం లో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వివిధ శిక్షణా కార్యక్రమాలు యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి డా. వినోద్ కుమార్, బాబు ఏ, ఎంఎం నాయక్, వర్చువల్గా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ సి. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.