విశాఖపట్నంలో బయటపడిన డ్రగ్స్‌కు సంబంధించి సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడ స్కాంలు బయటపడినా అందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉంటోంది. డ్రగ్స్ వ్యవహారాన్ని ఆ పార్టీ నేతలే దగ్గరుండి నడిపించినట్లు స్పష్టమవుతోంది.
25 వేల కేజీల డ్రగ్స్ కేసుపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తెలుగుదేశం పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా సంధ్యా ఆక్వా యజమాని కోటయ్య చౌదరికి పేరుంది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ కంపెనీ పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించినట్లు సమాచారం. పది మంది అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వాలో శుక్రవారం సాయంత్రం వరకు సోదాలు చేశారు. కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించిన మరిన్ని శాంపిల్స్‌ను వైజాగ్‌లో పరిశీలించగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ స్కాం చాలా పెద్దది. ఇప్పటికే ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎ, కవిత అరెస్ట్ అయ్యారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఒంగోలు ఎంపీగా రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఆ స్కాంలో ఉన్న సంధ్యా ఆక్వా యజమాని కోటయ్య చౌదరి బాబుకు బాగా కావాల్సిన మనిషి. దామచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆలపాటితో వ్యాపార బంధం కొనసాగిస్తున్నాడు. బాలయ్య చిన్నల్లుడు విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్‌తో స్నేహం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం, డ్రగ్స్ వ్యవహారానికి మధ్య ఏమైనా లింకులున్నాయా అని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బునే టీడీపీ మనుషులు లిక్కర్ సిండికేట్‌లో పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు బయటపడినా తనకు, తనతో సన్నిహితంగా ఉండేవారికి ఏమీ కాకుండా ఉండేందుకే చంద్రబాబు ఎన్డీఏలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ వ్యవస్థల్లో ఉన్న తన మనుషుల ద్వారా డ్రగ్స్ కేసును నీరుగార్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.