ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి టీడీపీ & కో దిగజారుడు రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. ఆయనేమన్నారంటే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జూలై 29వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ మద్దతు ఎందుకు ఇచ్చిందని సజ్జల ప్రశ్నించారు.
శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో చెప్పించాలని సజ్జల సవాల్ విసిరారు.