బొత్తిగా వ్యూస్ లెక్క పెట్టుకునే యూట్యూబ్ థంబ్ నెయిల్ బ్యాచ్‌లా తయారయింది ఈనాడు పరిస్థితి. ఆంధ్ర ఏదైనా మంచి జరిగితే వెంటనే వక్రపు వెక్కిరింతల వార్తల్ని వండి వడ్డించడమే ఈ దినపత్రిక దినచర్యగా మారింది. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం 6100 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతే… ఇంక విషపు రాతలు మొదలయ్యాయి.
రామారావు లక్ష్మి పార్వతి టైములోలా అబద్ధాలు రాస్తే అవే నిజమనుకోవడానికి ప్రజలు అమాయకులు కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకునే అవకాశం ఉంది. మెగా – దగా అంటూ తెలంగాణ నోటిఫికేషనుతో పోలుస్తూ రాసిన వార్తలో ఏవి నిజాలో జనానికి తెలియవు అనుకోవడం ఆ పత్రిక అమాయకత్వమే.
జగన్ ప్రభుత్వంలో 1998 డిఎస్సీ అభ్యర్థులు 4,059, 2008 డీఎస్సి అభ్యర్థులు 2,193,
2018 డీఎస్సీ అభ్యర్థులు 6,954, 2019 స్పెషల్ డీఎస్సి అభ్యర్థులు 602, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు అభ్యర్థులు1,200 మరియు 2024 డీఎస్సీ అభ్యర్థులు 6,100 మంది ఉన్నారు. అయితే ఇంత మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుండగా ఈనాడు తెలంగాణలో ఎంతో మందికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అబద్ధపు రాతలు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీ జరగనే లేదు.
అలాంటి పోస్టులన్నిటినీ కలిపి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటూ ఊదరగొట్టి నిజాలను తారుమారు చేస్తున్నారు.
పోనీ తమ అభిమాన చంద్రబాబు అయినా డీఎస్సీ అభ్యర్థులకి న్యాయం చేసారా అంటే 7254 అభ్యర్థులకు గాను ముక్కీ మూలిగీ 300 పోస్టులకి చేసారు. నాలుగేళ్ల అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు కూడా వెళ్ళారు.
2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు కూడా సీఎం జగన్ ఇపుడు న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమారు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు కూడా.
విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు కళ్లకు కడుతుంటే ఓర్వలేక చంద్రబాబు అభిమాన పత్రిక ఇలా అబద్ధాలు రాస్తూ ఇలా తన బుద్ధిని బయట పెట్టుకుంటుంది.