ఏపిలో అత్యంత ఆసక్తికరమైన పోటి వున్న నియోజక వర్గాల్లో ఒకటిగా ఉండి నియోజకవర్గం వుంది దానికి కారణం ఇక్కడ అత్యంత వివాదాస్పద నాయకుడిగా పేరున్న రఘు రామ కృష్ణంరాజు పోటిలో వుండటమే. రఘు రామ కృష్ణంరాజు వ్యవహార శైలి రాజకీయాల్లో మొదటినుండి వివాదాస్పదం గానే ఉంటుంది. ప్రస్తుతం టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా ఉన్న రఘు రామ కృష్ణంరాజు ఉండి టీడీపీ టికెట్ మాజీ ఎంఎల్ఏ శివరామ రాజుకు ఇప్పిస్తా అని తన చుట్టూ తిప్పుకొని చివరకు చంద్రబాబు నాయుడితో కలిసి డ్రామా ఆడి తనే స్వయంగా పోటిలో నిలబడ్డారు. ఇక్కడ మాజీ ఎంఎల్ఏ శివ రామ రాజు కు ఫోన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వెనక్కి తీసుకోమని బెదిరించి నీకు ఎన్ని ఓట్లు వుంటాయి మహా అంటే రెండు మూడు వేలు అంతేగా , డబ్బు లేదు అంటూ చులకన చేసి మాట్లాడి అవమానించారు. దానితో ఆత్మాభిమానం దెబ్బ తిన్న శివరామరాజు పోటీలో వుండటానికి నిశ్చయించుకొని తనని అవమానించిన రఘు రామ కృష్ణంరాజు ను ఓడించి తీరుతా అని ప్రకటించారు.
రఘు రామ కృష్ణంరాజు 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మొదట వైసీపీ అనుకూలంగా వుండి ఎలక్షన్ సమయానికి బిజెపి లో జాయిన్ అయ్యి బిజెపి లో నర్సాపురం ఎంపీ టికెట్ తనకే వచ్చిది అనే ధీమాతో చీరలు పంచి పెడుతూ ఎలక్షన్ కమీషన్ కు మీడియా కు దొరికిపోయారు, దీనితో బిజెపి అగ్రనేతలు రఘు రామకు కాకుండా గోకరాజు కు టికెట్ కేటాయించారు. దానితో బిజెపి కి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ 2019లో టీడీపీ గెలవడం కష్టం అని తనకున్న పరిచయాలతో జగన్ కి ఇష్టంలేకపోయినా వైసీపీలో జాయిన్ అయ్యారు. అక్కడ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం సంపాదించి జగన్ వేవ్ లో గెలిచి తన చిరకాల స్వప్నంను నెరవేర్చుకున్నారు. ఆ తరువాత వైసీపీ నుండి అనుచిత లబ్ధి కోసం వెంపర్లాడం దానికి జగన్ ఒప్పుకోకపోవడంతో జగన్ మీద వ్యక్తిగత విమర్శలతో , నోటి దూలతో నాలుగు సంవత్సరాలు తను గెలిచిన నర్సాపురం కు రాకుండా అలాగే ఏపీ లో అడుగుపెట్టకుండ హైదరాబాద్ డిల్లీలో వుంటూ కాలం గడుపుతు వచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు రాగానే కేసుల విషయంలో చంద్రబాబుకు చేసిన సాయంను చూపుతూ బ్లాక్ మెయిల్ చేసి టీడీపీ లో ఉండి టికెట్ సంపాదించారు. అలాగే శివరామ రాజును హేళన చెయ్యడంతో పాటు నమ్మించి మోసం చెయ్యడంతో టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు,కార్యకర్తలు అంతా శివరామ రాజు వెంట నడుస్తుండడంతో ఇప్పుడు ఓటమి భయం పట్టుకొని పార్టీ నాయకులు, కార్యకర్తల చుట్టూ తిరుగుతున్నారు. మీకు ఏది కావాలంటే అది చేస్తాను డబ్బు ఎంత అంటే ఇస్తాను నాకు మద్దతుగా నిలబడండి అంటూ బతిమిలాడుకుంటున్నారు.
ఇవన్నీ గమనించిన రాజకీయ పండితులు రాఘురమ కృషంరాజు తన నోటి దూలతో తన ఓటమిని కొనితెచ్చుకున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.