టీడీపీ, జనసేన, బీజేపీకూటమికి మరో సర్వే షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అంటూ రేస్ ప్రీ పోల్ సర్వే తేల్చేసింది . ఇప్పటికే జగన్ హవానే రాష్ట్రంలో ఉందని పలు జాతీయ సర్వేలు స్పష్టం చేస్తూనే వచ్చాయి. జగన్ పరిపాలనతో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని చంద్రబాబు, పవన్ కలిసి జగన్ పై మోపుతున్న నిందలని ప్రజలు నమ్మడంలేదని ఆ సర్వేల్లో స్పష్టమైన నేపథ్యంలో మరో సర్వే కూడా అదే స్థాయి తమ నివేదికని బయటపెట్టింది. రేస్ ప్రీ పోల్ సర్వే నివేదిక ప్రకారం 2024 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ సునాయసంగా 123-128 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నట్లు, సీఎంగా జగన్ పనితీరుపై 55.10% మంది సంతృప్తిగా ఉన్నట్టు, అలాగే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలంటూ 61.20% మంది తమ అభీష్టాన్ని వ్యక్తపరిచినట్టు తేల్చేసింది.
సర్వే ఏదైనా ఫ్యాన్ ప్రభంజనం కొనసాగడం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఏమాత్రం ప్రజలు నమ్మకపోవడంతో కూటమి పార్టీలకి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. నిత్యం సొంత మీడియా పేపర్ల ద్వారా వైసీపీపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నా ప్రజలు ఆ ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ సారి ఓటమి చెందితే ఇదే ఆ పార్టీలకి చివరి ఎన్నికలు అవుతాయనే భయాందోళనలు ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా గెలిచి తీరాలనే ఆత్రుత చంద్రబాబులో కనిపిస్తుంటే ఓటమి చెందాకా పార్టీలో ఉండాలా , పార్టీ మారీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచనలు టీడీపీ నాయకులు చేస్తునట్టు సమాచారం. దక్షిణ కోస్తా జిలాల్లో టీడీపీ తరుపున నిలబడ్డ ఎంపీలు ఇప్పటికే చేతులెత్తేసి కాడి దింపేసారనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది.