బ్రెజిల్ నుంచి పాతిక వేల కేజీల కొకైన్‌ను దిగుమతి చేసుకున్న డ్రగ్స్ డీలర్ల దందా వ్యవహారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పదవికి గండం తెచ్చింది. వీటిని బ్రెజిల్ నుంచి తెప్పించుకున్న సంధ్యా ఎక్స్ పోర్ట్స్ యజమాని కూనం వీరభద్రరరావు పురందేశ్వరి కుటుంబానికి దగ్గర బందువులు, తన భర్తకు వ్యాపార బాగస్వామి. వీరభద్రరావు కుమారుు కోటయ్య చౌదరి.. పురందేశ్వరి కుమారుడు ఇద్దరూ ఆప్తమిత్రులు, ఈ కంపెనీలో అధికారక డైరెక్టర్లు. ఇలా డ్రగ్స్ వ్యవహారం బయటకు రాగానే వారి ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బీజేపీలో కలకలం రేగింది. ఇంత భారీ డ్రగ్స్ వ్యవహారంలో స్వయంగా పురందేశ్వరి కుమారుడు హితేష్ ఉండటంతో బీజేపీ హైకమాండ్ సైతం.. అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కుమారుడు హితేష్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం తేలే వరకూ తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉండదల్చుకోలేదని పురందేశ్వరి అంటున్నట్లుగా చెబుతున్నారు. తాను ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానని కుమారుడిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని తేలిపిన తర్వాతనే మళ్లీ బాధ్యతలు తీసుకుంటానని అంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమె రాజీనామా లేఖను కూడా రెడీ చేసుకున్నారు. నిజానికి పురందేశ్వరి ని హైకమాండే రాజీనామా అడిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రివర్స్ లో పురందేశ్వరి.. రాజీనామాకు సిద్దమని చెబుతున్నట్లుగా బీజేపీ వర్గాల భావిస్తున్నాయి.
పురందేశ్వరితో సంధ్యా ఎక్స్ పోర్ట్స్ యాజమానికి కూనం వీరభద్రరావు చాలా దగ్గర వ్యక్తి. ఆయన వ్యాపారాల్లో అన్నింటిలోదగ్గుబాటి కుటుంబానికి కూడా వాటాలు ఉన్నాయి. పురందేశ్వరి ఈ విషయంలో ఎంతగా పట్టుదలకు పోతే.. అంతగా రచ్చ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే.. ఆమె తన రాజీనామా లేఖను రెడీ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ ఆమెను తీసేయాలని ఆదేశించకముందే రాజీనామాకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
అటూ ఇటూ తిరుగి డ్రగ్స్ కేసు బీజేపీ అధ్యక్షురాలి మెడకు చుట్టుకోవడం అనూహ్యమే. పట్టుబడింది చిన్న చిన్న డ్రగ్స్ కాదు.. చాలా పెద్ద డ్రగ్స్ రాకెట్. ఒక్క గ్రాము కొకైన్ పదిహేను వేల వరకూ అమ్ముతారు. అంటే. ఆ సరుకు మొత్తం ఎన్ని కోట్లు ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇది దేశ ప్రజలకు చేసిన ద్రోహం హైకమాండ్ ఏ మాత్రం సహనంతో ఉండే అవకాశం లేకపోవడంతో పురందేశ్వరి రాజీనామా లేఖను రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.