విజయవాడ వెస్ట్ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా పలు సంచలన కామెంట్స్ చేసిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపారు. భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడని, నటించేవాడు నాయకుడు కాలేడని చెప్పుకొచ్చిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రష్యా మోడల్ అయిన అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరికి విడాకులిచ్చిన పవన్ అన్నా లెజ్నోవాను వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. కాగా వీరికి పాలేన అంజనా పావనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు సంతానం కలిగారు. ఈమధ్య పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజ్నోవాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం జరిగింది. కాగా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ వివాహానికి అన్నా లెజ్నోవా హాజరైన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు.
దీంతో ఆ ప్రచారానికి తెరపడింది. కాగా పోతిన మహేష్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కట్టుకుంటున్న ఇంటి ప్రవేశానికి తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి రావాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. వరుణ్ తేజ్ పెళ్లి కోసం అన్నా లెజ్నోవాను బ్రతిమిలాడి తీసుకొచ్చారని, ఇప్పుడు ఆమె గృహ ప్రవేశానికి రావడం అసాధ్యమనే ప్రచారం మొదలైంది. అన్నా లెజ్నోవా పవన్ కి దూరంగా ఉంటుందని, ఆమె తిరిగి పవన్ దగ్గరకు వచ్చే అవకాశం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు వేణుస్వామి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అతని జాతకంలో ఉందని చెప్పే ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడం విశేషం.. మరి పోతిన మహేష్ కావాలనే అన్నా లెజ్నోవాను గృహ ప్రవేశానికి తీసుకుని రమ్మన్నాడా లేక వారిద్దరి మధ్య సఖ్యత లేదని లోకానికి చాటి చెప్పే క్రమంలో అన్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుంది.