ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. పరిశ్రమలను మన ఐటీఐ, పాలిటెక్నికల్ కాలేజీలను కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేసే కార్యక్రమమే భవిత. మనం చదువుతున్న ఏ చదువైనా… అది పాలిటెక్నిక్, ఐటీఐతో పాటు ఇంజనీరింగ్, డిగ్రీల వరకు ఏదైనా జాబ్ ఓరియెంటెడ్‌గా లేకపోతే అవి వృధా అవుతాయి. ఈ దిశలో అడుగులు వేస్తూ…ప్రతి రంగంలోనూ జాబ్ ఓరియెంటెడ్‌గా అడుగులు వేస్తున్నాం. ఒకవైపు ఉన్నత చదువుల్లో మరింత క్వాలిటీ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకు వస్తున్నాం. స్కూల్స్ నుంచి కాలేజీలు కలుపుకుని ఐటీఐ, పాలిటెక్నిక్‌ల వరకు ఈ అడుగులు పడుతున్నాయి. స్కూల్స్ గురించి, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల గురించి నేను చాలా సార్లు చెప్పాను.
ప్రభుత్వ స్కూల్స్‌ను ఇంగ్లిషు మీడియం వైపు అడుగులు వేయించడంతో పాటు, సీబీఎస్ఈ మొదలు ఐబీ ప్రయాణం వరకు తీసుకునిపోతున్నాం. స్కూల్స్‌లో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్‌ను తీసుకునిరావడంతో పాటు , టోఫెల్‌ను ఒక క్లాస్‌గా 3వ తరగతి నుంచే పరిచయం చేస్తూ పిల్లలకు ఓరియెంటేషన్ ఇస్తున్నాం. బైలింగువల్స్ టెక్ట్స్‌బుక్స్ పంపిణీ, క్లాసు రూమ్‌లను డిజిటలైజేషన్ చేయడం, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యతను పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం స్కూల్స్ దగ్గరే ఆగిపోలేదు. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో కూడా ఇవే అడుగులు వేస్తున్నాం. ఆ కాలేజీలలో కూడా కరిక్యులమ్ మార్చడం నాలుగేళ్ల హానర్స్ డిగ్రీతోపాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్లైన్ వర్టికల్స్‌ని చదువులలోకి అనుసంధానం చేస్తున్నాం. ఆ ఆన్లైన్ వర్టికల్స్‌లో వచ్చే క్రెడిట్స్‌ని మన కరిక్యులమ్‌లోకి తీసుకు వస్తున్నాం. ఈ సర్టిఫైడ్ వర్టికల్స్ ఆన్లైన్ విధానంతో కరిక్యులమ్‌లో భాగం అవుతున్నాయి.
బహుశా దేశంలో ఎక్కడా జరగని విధంగా.. ఆంధ్రరాష్ట్రంలో ఈ రోజు మొట్టమొదటసారిగా, గతంలో చూడని విధంగా ఇంజనీరింగ్, డిగ్రీ పిల్లలకు వారి కరిక్యులమ్‌లో హార్వర్డ్, ఎల్ఎస్ఈ, ఎల్బీఎస్, ఎంఐటీ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను కూడా ఆన్లైన్లో మన కరిక్యులమ్‌లో భాగంగా తీసుకువస్తున్నాం. ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిపించడంతో పాటు, పిల్లలకు ఆ సబ్జెకులు తీసుకునే వెసులుబాటు కలిగుతుంది. ఆ సబ్జెక్టులో వాళ్లు ప్రావీణ్యం సంపాదించి, పరీక్షలు రాస్తారు. అది వాళ్ల కరిక్యులమ్‌లో భాగమై ఆ స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ, హర్వర్డ్ సంస్ధలు ఆ సబ్జెక్టులలో పిల్లలకు ఉత్తీర్ణులని సర్టిఫికెట్లు ఇస్తారు. మొట్టమొదటసారిగా ఇవన్నీ కాలేజీలలో జరుగుతున్నాయి.
ఒక్కసారి హార్వర్డ్ నుంచి రిస్క్ మేనేజిమెంట్, హెల్త్ మేనేజిమెంట్ వంటి ఇలాంటి సబ్జెక్టులలో సర్టిఫికేట్ తీసుకుని…మన పిల్లలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే… అప్పుడు మన పిల్లల ఉద్యోగఅవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా చూస్తే10-15 ఏళ్లలో మన పిల్లల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయంటే… గవర్నమెంటు బడులలో చదివే మన పిల్లలు అనర్ఘళంగా ఇంగ్లిషు మాట్లాడుతూ… ఐబీ సర్టిఫికేట్ తీసుకుంటారు.
ఇక్కడ కాలేజీలలో చదువుతూ ఎంఐటీ, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ ల నుంచి సర్టిఫికేట్ కోర్సులతో బయటకు వచ్చి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టే పరిస్థితి రానున్న పది సంవత్సరాలలో రానుంది.
ఒకవైపున స్కూల్స్‌లోనూ, కాలేజీలలోనూ ఈ కార్యక్రమాలు తీసుకువస్తూనే.. మరోవైపు మన దగ్గర ఉన్న ఐటీఐలు, పాలిటెక్నిక్, స్కిల్లింగ్ కళాశాలలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఇందులో భాగంగా మనం అనుకున్న మేరకు మార్పులు చుట్టే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి. నెక్ట్స్ టర్మ్‌లో ఆ అడుగులు పూర్తిగా విశ్వరూపం దాల్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు మొట్టమొదటి సారిగా158 పారిశ్రామిక సంస్ధలు, ఏకంగా 208 ఐటీఐ, పాలిటెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్‌తో కొలాబిరేషన్ జరుగుతుంది. ఆ సంస్ధలు ఈ కాలేజీలలో భాగమై… మన పిల్లల శిక్షణలో భాగస్వాములవుతారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. ఇది చరిత్రలో నిల్చిపోయే ఘట్టం.
రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు రావడానికి చదువుల్లో క్వాలిటీ చదువులు ఎంత అవసరమో, ఆ క్వాలిటీ చదువులు తెచ్చుకోవడానికి మనం చదివే కోర్సులలోనో… ఇంటర్న్‌షిప్ పరంగానో, శిక్షణ తీసుకోవడమో, లేదా కోర్సు పూర్తయిన తర్వాత మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది పాటు ఉండే పాలిషింగ్ కోర్సులు చేయడం అవసరం. తద్వారా మన డిగ్రీలను పాలిస్ చేసి మెరుగ్గా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం జరగాలి. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం.
దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019 కంటే ముందు అక్రిడేషన్ పొంది పాలిటెక్నిక్ కాలేజీలు ఒక్కటి మాత్రమే. అంటే కనీసం మనం పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి? జాతీయ ప్రమాణాలతో ఉన్నాయా? లేదా? కనీసం వాటి అక్రిడేషన్ ఉందా లేదా అన్నది కూడా గతంలో పట్టించుకోలేదు.
ఇవాళ 87 పాలిటెక్నిక్ కాలేజీలలో 32 కాలేజీలు ఎన్బీఏ అక్రిడేషన్ పొందాయి. ప్రతి అడుగులోనూ క్వాలిటీ పెంచుతున్నాం. ఈ ప్రయాణం మొదలైంది. రాబోయే రోజుల్లో ఇంతకన్నా మెరుగ్గా చేసే దిశగా అడుగులు సిద్ధం చేశాం. ఐటీఐ, పాలిటెక్నిక్‌లు, డ్రాపౌట్స్ కోసం స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అవసరమైన ఫెసిలిటీస్ అరకొరగా ఉన్న పరిస్థితులతో పాటు కొన్నిచోట్ల అస్సలు లేని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేసి, అందులో ఒకేచోట ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, పదోతరగతి డ్రాపౌట్స్కి ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలన్నది ఆలోచన. దీనివల్ల స్టాఫ్ సామర్ధ్యం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి వర్క్‌షాపుల నిర్వహణ చేపట్టవచ్చు. ఇవన్నీ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ ఐటీఐను తీసుకుని రావడమే కాకుండా దాన్ని ఇండస్ట్రీతో అనుసంధానం చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక స్కిల్ కాలేజీ వీటన్నింటికి పైన ఒక స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీ డైనమిక్‌గా కోర్సులు డిజైన్ చేస్తుంది. పరిశ్రమరంగంతో మాట్లాడుతూ… ఆ కోర్సులను డిజైన్ చేస్తుంది. కాలేజీలలో భాగస్వామ్యం చేస్తూ.. వాళ్ల అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు కూడా చేస్తుంది. వాళ్లు డిజైన్ చేసిన కోర్సులను స్కిల్ కాలేజీల నుంచి స్కిల్ హబ్స్ వరకు తీసుకువచ్చి పరిశ్రమలతో మమేకం చేస్తుంది.
ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా వీటన్నిటి మీద శిక్షణ ఇవ్వడంతోపాటు చదివిన తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా ఈ వ్యవస్ధలను మార్పు చేసే విధంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దేవుడి దయతో ఇవాళపడిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా విస్తరిస్తూ.. ఇంకా ఎక్కువ మందికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇప్పటికే దాదాపుగా 158 పారిశ్రామిక సంస్ధలతో టైఅప్ అయి 208 సంస్ధల్లో 53వేల మంది శిక్షణ పొంది, అందులో 26 వేల మందికి ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. ఇకపై దీన్ని పైలట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అడుగులు ముందుకు వేయించేందుకు భవిత అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ తీసుకునిపోయే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
నా తరపున మీ అందరికీ మరోసారి ఆల్‌దిబెస్ట్ తెలుపుతూ.. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.