విద్యార్థుల భవిష్యత్తును మార్చే విశ్వవిద్యాలయాల స్థాపనే ధ్యేయంగా వైయస్ జగన్, నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత, సాంకేతిక విద్యకు అనువుగా ఉండే విశ్వవిద్యాలయాల నిర్మాణానికై ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా సీయం, పీయం ఇద్దరూ… విద్యార్థుల ఉన్నతికే పెద్ద పీట వేసి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నిర్మణాన్ని చేపడుతున్నారు. అలా మన విశాఖ సిగలోకి రాబోతున్న మరొక గొప్ప అంశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి శాశ్వత విశ్వవిద్యాలయ నిర్మాణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన ఒక అంశమయిన ఈ ఐఐఎం యూనివర్సిటీ, గత కొంతకాలంగా ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా తన సేవలను విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకై అందిస్తుంది. దీని కోసమై ఆనందపురం సమీపంలో సుమారు 240 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైయస్ జగన్ హయాంలో ఉచితంగా యూనివర్సిటీ నిర్మాణానికై ఇచ్చింది. శాశ్వత భవనం నిర్మాణానికై చేపట్టిన పనులు రెండు దశల్లో సాగుతాయి. మొదటి దశగా బిల్డప్ ఏరియా నిర్మానాన్ని సుమారు 470 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీనిని ఈరోజు ప్రధాని మోడీ, సీయం జగన్ వర్చువల్గా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీని మించేలా ఉండటం ఈ విశాఖ ఐఐఎం యూనివర్సిటీ ప్రత్యేకత. విద్యార్థులు U ఆకారంలో కుర్చుని పాఠాలు వినేలా తరగతి గదులను డిజైన్ చేసారు. యూనివర్సిటీ అవసరమయిన విద్యుత్ ని సోలార్ ప్లాంట్ల నుంచి అందించేలా సోలార్ సిస్టం నిర్మాణం కూడా జరిగింది.