పిన్నెల్లి సోదరులు పెద్ద మనసు చాటుకున్నారు. తమను నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద బాపట్లలోని ఉప్పెపాళేనికి చెందిన శరణం గోపిరెడ్డి (30) గన్‌మన్‌గా ఉన్నాడు. ఇతను ఆదివారం మోటార్‌బైక్‌పై బాపట్లకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గోపిరెడ్డి మృతిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటంతో పాటు హుటాహుటిన బాపట్ల బయలుదేరి వెళ్లిన పిన్నెల్లి సోదరులు ఇన్నాళ్ళూ తమ వెంట రక్షణగా నడిచిన గన్ మెన్ గోపిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గోపిరెడ్డి తండ్రి గతంలోనే మరణించాడు. భార్య ప్రస్తుతం ఏడునెలల గర్భంతో ఉంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిపోయిన పిన్నెల్లి సోదరులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న గోపిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చి పుట్టెడు కష్టంలో ఉన్న గోపిరెడ్డి కుటుంబానికి జీవితకాలం తోడుంటామని ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. నమ్మిన నాయకులు, కార్యకర్తలకు కష్టకాలం వస్తే పిన్నెల్లి సోదరులు ముందుండి అండగా నిలుస్తారని మరోసారి రుజువు చేశారు.