మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొల్లు రవీంద్ర చేసిన, చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ ఘాటుగా విమర్శించారు.
గడిచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారు అని పేర్ని నాని విమర్శించారు. బలరాంపేట వడ్డెర బస్తీలో.. పార్కుకై కేటాయించిన స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కి ఇచ్చి, రోజువారి కూలి చేసుకునే మా వడ్డెర సోదరులను కొల్లు రవీంద్ర మోసం చేసారని అన్నారు.
“అధికారం లో ఉన్నా, లేకపోయినా పేర్ని నాని, పేర్ని కృష్ణ మూర్తి పేద, మధ్యతగతి ప్రజల పక్షాన నిలిచే వ్యక్తులని, నాని ప్రజలతో ప్రభుత్వ స్థలాలలో ఏరోజూ పాకలు వేయించలేదనీ, ఆర్ధికంగా పేదరికం లో ఉండి రోడ్ పక్కన ఉన్న వారికి పక్క ఇల్లు నిర్మాణం కోసం స్థలాలు కేటాయించింది నేనేననీ” పేర్ని నాని వివరించారు.
తెదేపా ప్రభుత్వంలో, పదవి పోబోతున్న పది రోజుల్లో విలేఖర్లకు కొల్లు రవీంద్ర హడావిడిగా ఇంటి పట్టాలు ఇచ్చారనీ ఎటువంటి సర్వై నుంబర్లు వాటిపై లేవనీ, విలేఖర్లకు ఇచ్చిన స్థలాల రికార్డులు ఎందుకు మాయం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలనీ పేర్ని నానీ… కొల్లు రవీంద్రను డిమాండ్ చేసారు.
రాజుపేటకు చెందిన మీ కార్యకర్తలు హయత్ ఖాన్ కు ఇచిన్నవి దొంగ పట్టాలనీ, పేదోడికి పేర్ని నాని ఇచిన్నవి నిజమైన పట్టాలనీ, చిలకలపూడి పాండురంగ పాఠశాల దగ్గర ఒకే ఇంటికి నాలుగు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనుడు కొల్లు రవీంద్ర అనీ, 1977-78 తుఫాన్ లో నష్ట పోయినా గిరిపురం మత్యకారులకు కనీసం ఒక్కరికైనా కొల్లు మంత్రిగా ఉన్న సమయం లో ఇంటి పట్ట ఇచ్చిన పాపాన పోలేదనీ, మచిలీపట్నం పేద మధ్య తరగతి ప్రజలు ఉన్న ప్రాంతం లో రోడ్లు,తాగునీటి సదుపాయాన్ని జగన్ సహకారంతో తాను చేసాననీ పేర్ని నాని మొత్తం వివరాలు మీడియా ముందు ఉంచారు.
గుమటాల చెరువు లో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించారు వారికి పట్టాలు ఇవ్వలేదు ఇవ్వగలవా ?? రేపు రాన్నున ఎన్నికలలో 2024 జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. నా కుమారుడు పేర్ని కిట్టు యం. ఎల్. ఏ అవటం ఖాయం. అదే గుమ్మటల చెరువు లో ఇల్లు వేసుకున్న ప్రజలకు నా కుమారుడు పట్టాలు ఇస్తాడు మీరు చూస్తూ ఉండండి అని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.