వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో ఉంది. దీంతో ఈ ప్రక్రియ సకాలంలో.. సజావుగా జరుగుతోంది. గురువారం నగదు పంపిణీని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తొలిరోజున 53.15 లక్షల మందికి రూ.1,574 కోట్ల సొమ్ము అందజేశారు. రికార్డు స్థాయిలో 80.35 శాతం నమోదైంది. కాగా మొత్తం లబ్ధిదారులు 66.15 లక్షలు. వారి కోసం కేటాయించిన నగదు రూ.1,961.13 కోట్లు. నేరుగా ఇంటికి వెళ్లి డబ్బు చేతిలో పెడుతుండటంతో పెన్షన్‌దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5వ తేదీ వరకు అందజేయాల్సి ఉండగా వలంటీర్లు మూడురోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఉన్నారు.