రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకోవాలని ప్రయత్నించండంతో మరింత రెచ్చిపోయారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేయాలనీ, వాటితో పాటు మరొక 16 డిమాండ్లను కూడా తీర్చాలని సర్పంచుల సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగ నిరసన చేయాలని రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చింది.
అయితే, ఈ నీరసానికి, ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతులు లేవనీ, ఈ సంఘాల మాటున విద్రోహ శక్తులు ర్యాలీలలో పాల్గొని ఘర్షణలు చేయడానికి పధకం రచించే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు నిన్నటి నుండే అనుమతులు లేనందున ఈ కార్యక్రమాన్ని ఆపుచేస్తామని ముందస్తు హెచ్చరికలు కూడా అన్ని జిల్లాల వారీగా చేసారు.
కానీ, గృహనిర్బంధం నుంచి “ఛలో అసెంబ్లీకి” బయలుదేరేందుకు వై.వీ.బీ రాజేంద్రప్రసాద్ యత్నించడమే కాకుండా, మిగిలిన సర్పంచులకు కూడా పిలుపునివ్వడంతో వారంతా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీనితో పోలీసులు రాజేంద్రప్రసాద్ ను నిలువరించేందుకు యత్నించగా, పోలీసులకు మరియు రాజేంద్రప్రసాద్ అనుచరులకు మధ్య తీవ్రతోపులాటలు జరిగాయి.
ఆయన ఇంటి వద్ద నేలపై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై నిరసన తెలియజేస్తున్న రాజేంద్రప్రసాద్ మరియు ఆయన అనుచరులు. ఉయ్యూరులో చలో అసెంబ్లీకి అనుమతి లేదని నిరాకరించిన పోలీసులు.
అనంతరం రెచ్చిపోయిన వైవిబి అనుచరులు తీవ్ర నష్టం కలిగించేలా దాడులకు తెగబడుతూ, టైర్లు తగలబెట్టి, పోలీసులపై నిప్పు పెట్టిన టైర్లను విసిరారు. టైర్లు విసరడంతో భయాందోళనకు గురైన పోలీసులు, వారందరిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.