ఇంకా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ రాలేదు కానీ ఉరవకొండ టీడీపీఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రలోభాలకు తెరలేపాడు. ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికి చీరలు పంపిన చేస్తున్న టీడీపీ నేతలు చీరలతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. చీరలు తీసుకోండి పయ్యావుల కేశవ్ కు ఓటు వేయండి అంటు ఉరవకొండ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మీడియా ముందుకు వస్తే చాలు తన కంటే శుద్ధ పూస ఎవరు లేరన్నట్లు ప్రవర్తించే పయ్యావుల కేశవ్ , ఎన్నికల దగ్గర పడే కొద్దీ తన అసల రూపం బయట పెడుతున్నాడు. మీడియా ముందు మాత్రం నీతి వ్యాఖ్యలు చెప్పడం వెనుక ఇలా ప్రజలకు ప్రలోభాలకు గురి చేయడం పయ్యావుల కేశవ్ కే చెల్లింది.
2019లో ఎన్నికల విజయం సాధించిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన పయ్యావుల కేశవ్ అయిదు సంవత్సరాలు తన వ్యాపారాలును చక్కబెట్టుకొని ఎన్నికలు వస్తున్నాయన్న తరుణంలో నియోజక వర్గంలో చీరలు పంచిపెట్టడం మొదలు పెట్టాడు. ఎన్నికల ముందు చీరలు పంచేస్తే సరి అనుకున్నాడేమో తన కార్యకర్తల ద్వారా పంచడం మొదలుపెట్టించి, చీరతో పాటు ఒక కరపత్రం ఇస్తూ చీర తీసుకొంటున్నారు కాబట్టి ఓటు తమకే వేయాలి అని దేవుడి మీద ప్రమాణం చేయించుకుంటున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇన్నాళ్లు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా చివరి రోజుల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లను దండుకోవాలని చూస్తున్న పయ్యావుల కేశవ్ కి ప్రజలు బుద్ది చెప్పేందుకు ఆ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు.