పిఠాపురం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అంటూ కెమెరాల ముందు బతిమిలాడుకుంటూ నటిస్తున్న పవన్ కళ్యాణ్ తెరవెనుక లెక్కలేనన్ని అక్రమాలు చేస్తున్నాడు. పైకి మహాత్ముడిలా కనిపిస్తూ లోపల మాత్రం కుట్రలు చేస్తూనే ఉన్నాడు.
క్రియాశీలక కార్యకర్తల పేరుతో పదివేల మంది ప్రైవేట్ సైన్యాన్ని పవన్ సిద్ధం చేసుకున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో మండలాల వారీగా వీరిని నియమించారు. ప్రతి 250 మందికి ఒక ఇన్చార్జిని పెట్టినట్లు తెలుస్తోంది. వీరంతా ఆయన కరుడుగట్టిన అభిమానులే. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు అందరి పనిని మానిటరింగ్ చేస్తుంటారు. ఎన్నికల కోసం పనిచేందుకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల పైనే డబ్బు ఇస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొందరు ఇన్చార్జిలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పిఠాపురంలో సమావేశం నిర్వహించారు. ఇది జనసేన ఐటీ విభాగం నాయకుడు పెన్నమరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నికల్లో పవన్ కోసం ఎలా పనిచేయాలో వారందరికీ దిశానిర్దేశం చేశారు.
ప్రైవేట్ సైన్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంది. పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని నిత్యం పోస్టులు పెడుతున్నారు. ఇంకా అనేక అంశాల్లో ఫేక్ ప్రచారానికి తెరతీశారు. వాస్తవానికి సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ, ఎన్ఆర్ఐలు తదితరుల నుంచి సేనాని వందల కోట్ల రూపాయలు దండి పిఠాపురంలో కుమ్మరిస్తున్నాడు. టీ దుకాణాలు, బస్టాండ్, రద్దీగా ఉండే ప్రాంతాలకు సదరు వ్యక్తులు వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత, గోదావరి జిల్లాల కో–ఆర్డినేటర్ మిథున్‌రెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్‌ను పొగుడుతూ ఆయన వస్తే నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని చెబుతున్నారు. ఈ గ్యాంగే మైక్ ముందు పవన్ గురించి మంచిగా మాట్లాడి.. ప్రత్యర్థులను తిట్టిన వీడియోలను స్థానికుల అభిప్రాయంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేస్తున్నారు.
పవన్ తన ప్రైవేట్ సైన్యానికి ఆర్థిక వనరులు సమకూర్చి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రత్యర్థులను దిగజారి తిట్టాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వాళ్లంతా రెచ్చిపోతున్నారు. గ్యాంగ్‌లో చాలామంది స్థానికులున్నారు. వీళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఇంటికీ వెళ్లి ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటున్నారు. పోలింగ్ సమయానికి బహుమతులు, నగదు ఇచ్చేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక వేసుకున్నారు. పవన్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడు. వారికి సమాజ శ్రేయస్సు పట్టదు. ఇలాంటి వారైతేనే పిఠాపురంలో తనకు పనికొస్తారని నియమించుకున్నట్లు తెలుస్తోంది.