ప్రశ్నించడం కోసం జనసేన పార్టీని పెట్టాను. పవన్ కళ్యాణ్ నిత్యం చెప్పే మాట ఇది. కానీ ఆచరణలో మాత్రం మరోలా ఉంటుంది. అసలు సేన పుట్టిందే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం. ఇది జగమెరిగిన సత్యం. 2014 ఎన్నికల్లో గెలుపు కోసం బాబు పవన్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఆయన ఆ ఏడాది మార్చి 14వ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మీటింగ్ పెట్టి జనసేనని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఏమి చేస్తున్నాడో తనకే స్పష్టత లేదు. పైకి అనేక సిద్ధాంతాలు చెప్పినా.. నారా వారు చెప్పిన ప్రకారం నడుచుకోవడమే ఆ పార్టీ సిద్ధాంతం. 14లో పోటీ చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించినా ఏనాడూ సేనాని ప్రశ్నించలేదు. కొంతకాలం ఆయన బాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై విమర్శలు చేశారు. అయితే అదంతా డ్రామా అని తర్వాత తేలిపోయింది. 19 ఎన్నికల్లో సేనను వేరే పార్టీలతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పవన్ అలాగే చేశారు. అయితే అనుకున్న ఫలితం రాకపోవడంతో 24 ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పవన్‌కు మొదటి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే అసూయ ఎక్కువ. ఈ నేపథ్యంలో టీడీపీ ఆఫీస్ ఇచ్చే స్ర్కిప్ట్‌ల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను తిడుతుంటారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు.
24 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. యువగళం పాదయాత్ర సమయంలో సేనాని తన వారాహి యాత్రను ఆపేశారు. ఇక నుంచి బాబు ఇచ్చే ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇంకా తన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. అసలు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టత లేదు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని.. లేదు పార్లమెంట్‌కు బరిలో ఉంటారని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా చాలారోజులుగా జనంలో లేని పవన్ నారా వారి ఆదేశాల మేరకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో జిల్లాకు మూడుసార్లు వెళ్లాలని చెప్పడంతో పార్టీ ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. •కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలని టీడీపీ అధినేత సూచించడంతో పర్యటనలో ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టనున్నారు. పవన్ తిరిగే ఖర్చంతా తెలుగుదేశందే. ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను సిద్ధం చేస్తోందని తెలిసింది. రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. నాలుగు రోజులు అక్కడే ఉండి ముఖ్యనేతలతో సమీక్షలు చేస్తారు. తొలుత భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, 15న అమలాపురంలో, 16న కాకినాడలో, 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశాలుంటాయని సమాచారం.
అయితే సమావేశాల్లో పవన్ ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. బాబును సీఎం చేయడమే తన లక్ష్యం కాబట్టి.. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా వైఎస్సార్సీపీని ఓడించాలంటే మనం తగ్గి ఉండాలని నేతలకు ఉదాహరణలతో వివరస్తాడు. మధ్యమధ్యలో కావాలని అధికర పక్షంపై తిట్లు కురిపిస్తాడు. సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తాడు. తనకు పదవులపై ఆశల్లేవని డైలాగులు చెస్తాడు. జగన్‌ను గద్దె దించాలి కాబట్టి మనం ఇచ్చినన్ని సీట్లు తీసుకోవాలి. ఒత్తిడి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చివరికి అందర్నీ సినిమా స్టైల్లో బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. సీఎం జగన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడిగా పిలుస్తాంటారు. సేనాని చేష్టలు చూస్తే ఈ పేరు కరెక్ట్ అనిపించక మానదు. సేనపై పెట్టే పెట్టుబడి తనకు సీఎం కుర్చీని రిటర్న్‌గా ఇస్తుందని బాబు కల కంటున్నారు. పవన్ సినిమాలు ప్రస్తుతం రీ రిలీజ్ అవుతున్నాయి. అలా అని అజ్ఞానవాసిని విడుదల చేస్తే ప్రజలు ఆదరిస్తారా.. లేదు కదా.. బాబు కలలు కూడా అంతే.