ఒక రాజకీయనాయకుడిగానే కాదు, మామూలు మనిషిగా అయినా కూడా ఒక ఆడపిల్లని రేప్ చేసి, చంపేస్తే ఎంతటి కఠినాత్ముడు అయినా కూడా గుండె తరుక్కుపోతుంది. తరుక్కుపోవాలి కూడా. మన చుట్టుపక్కలే కాకుండా, ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగాయని తెలిసినా అందరి మనసులు కలచివేస్తాయి. అందుకే ఎక్కడో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటనపై దేశమంతా ఏకం అయింది.
కానీ సదరు పవన్ కళ్యాణ్ కి మాత్రం తనకి అవసరమైనవీ, మైలేజ్ ఇచ్చేవి మొదలగు వాటికే మాత్రమే తన గుండెని కుమిలిపోయే డిజైన్ చేసుకున్నట్టున్నారు. ఎందుచేతనంటే. హైదరాబాద్ శంషాబాద్ దగ్గర డాక్టర్ ప్రియాంక రెడ్డి ని కొంతమంది రేప్ చేసి చంపేస్తే, రేప్ చేసినవాళ్లను 2 బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమన్నాడు తప్ప గుండె కలచివేసింది అనే డైలాగులు చెప్పలేదు.
బాబు సీఎంగా ఉన్నప్పుడు ..కర్నూలులో 2017 ఆగస్ట్ 19న సుగాలి ప్రీతి అనే గిరిజన బాలికను హత్య చేశారు. అప్పుడు సార్ ఏం పట్టించుకోలేదు. అప్పుడు గాడిద పళ్లు తోముతున్నారా? అని అనుకోకండి. ఎందుకంటే అప్పుడు బాబు కదా సీఎంగా ఉంది, అందకుని సారు ఫీలవలేదన్నమాట. కానీ, జగన్ సీఎం అయ్యాక కేసు విచారణ వేగవంతం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అంటూ ఒక సభ పెట్టి ఆ సభలో వాళ్ళ తల్లి తండ్రుల్ని పరామర్శించి ప్రచారం పొందటానికి ప్రయత్నం చేశాడు. ఆ వేదిక పై ఈ కేసుని సీబీఐకి అప్పగించమని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోరగా ఆమేరకు కేసుని సిబిఐ కి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.
అంతేకాదు సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ కు ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది వైకాపా ప్రభుత్వం. ఇవన్నీ మరిచిన జనసేనాని ఇప్పుడు కొత్తగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ సుగాలి ప్రీతి గుర్తొచ్చి గుండె కలచివేస్తుందనే డ్రామానికి తెరలేపి ఓట్లు దండుకోవడం కోసం మేకప్ వేసుకుని జాలి మాటలు మాట్లాడుతూ ప్రజలు గమనించరనుకుని కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారు.